
చేనేతకు శాపం!
● బకాయిల చెల్లింపుల్లో జాప్యం
● ఆప్కో బకాయిలు రూ.1.23 కోట్లు
పొందూరు : జిల్లాలోని చేనేత సహకార సంఘాలకు ఆప్కో చెల్లించాల్సిన బకాయిలు విడుదల కాకపోవడంతో చేనేత సొసైటీలతో పాటు కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా సహకారం సంఘాల నిర్వహణ కష్టతరమవుతోంది. దీంతో సొసైటీలపై ఆధారపడిన చేనేత కుటుంబాలకు సకాలంలో అందాల్సిన మజూరీ డబ్బులు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్నారు. జిల్లాలో 36 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో సుమారు 20 వరకు మాత్రమే పనిచేస్తున్నాయి. ఈ చేనేత సహకార సంఘాలన్నీ వస్త్రాలను తయారు చేసి ఆప్కోకు విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం ఆప్కో 14 సహకార సంఘాలకు చెల్లింపులు చేయాల్సి ఉంది. ఆప్కో ఇచ్చిన ఆర్డర్ల మేరకు సాధారణ, ఇతర రకాల వస్త్రాలు తయారవుతున్నాయి. సహకార సంఘాలు ఇచ్చిన వస్త్రాలకు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేపట్టాల్సిన ఆప్కో జాప్యం చేయడంతో ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. లాభాల్లో ఉన్న సొసైటీలు సైతం బకాయి సొమ్ములు రాకపోవడంతో ఇబ్బందులు పాలవుతున్నాయి.
బకాయిలు ఇలా..
ఆప్కో బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో జిల్లాలోని సహకార సంఘాలు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. సుమారు ఏడాది నుంచి బకాయిలు చెల్లించాల్సి ఉంది. శ్రీకాకుళం జిల్లా పరిధిలోని శ్రీకాకుళం డివిజన్, విజయనగరం జిల్లాలోని రాజాం డివిజన్ పరిధిలో రూ.1.23 కోట్లు బకాయిలు అందాల్సి ఉంది. పొందూరు సాయిబా
చర్యలు తీసుకుంటున్నాం
జిల్లాలో చేనేత సహకార సంఘాలకు బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రెండు రోజుల్లో సొసైటీలకు సంబందించిన ఖాతాల్లో ఆ మొత్తాలను జమ చేయనున్నారు.
– టి.జనార్ధన, ఆప్కో ఇన్‌చార్జి డీఎం, శ్రీకాకుళం
బా సొసైటీకి రూ.17 లక్షలు, అంపోలు అగస్తేశ్వర సహకార సంఘానికి రూ.18 లక్షలు, లావేరులో సహకార సంఘానికి రూ.19 లక్షలు, తోలాపిలో గౌరీశంకర చేనేత సహకార సంఘానికి రూ.లక్ష, అక్కుపేట సంఘానికి రూ. 2 లక్షలు, సోంపేట సంఘానికి రూ.లక్ష, పెనుబాక విశ్వేశ్వర చేనేత సహకార సంఘానికి రూ.18 లక్షలు, రాజాం శ్రీమల్లికార్జున వీవర్సు సొసైటీకి రూ.17 లక్షలు, సురవరం సంఘానికి రూ.79 వేలు, మామిడిపల్లి సంఘానికి రూ.76 వేలు, పాలకొండ సంఘానికి రూ.7 లక్షలు, బైరిసారంగిపురంలో సంఘానికి రూ.11 వేలు బకాయిలు అందాల్సి ఉంది.

చేనేతకు శాపం!