
మహిళలు–పిల్లల సంక్షేమంపై అవగాహన
శ్రీకాకుళం అర్బన్: మహిళలు, పిల్లల భద్రత కోసం చట్టాలపై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉంటేనే లబ్ధిదారులకు పథకాల ప్రయోజనాలు అందుతాయని జిల్లా మహిళా, శిశు అభివృద్ధి శాఖ సాధికారత అధికారి ఐ.విమల అన్నారు. జిల్లాలో సంకల్ప్ పేరిట 10 రోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఐసీఈఎస్ పీడీ విమల సమావేశానికి అధ్యక్షత వహిస్తూ మాట్లాడారు. మహిళలు, పిల్లల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చట్టాలపై అధికారులు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు అవగాహన కల్పించారు. బేటీ బచావో– బేటీ పడావో, పీసీపీఎన్‌డీటీ యాక్ట్, ఎంటీపీ యాక్ట్ వంటి అంశాలపై ప్రత్యేక సెషన్ నిర్వహించారు.
జిల్లా ఆట్యా–పాట్యా జట్ల ఎంపిక రేపు
శ్రీకాకుళం న్యూకాలనీ: ఆట్యా–పాట్యా జిల్లా సీనియర్స్ పురుషులు, మహిళల జట్ల ఎంపికలను శనివారం నిర్వహిస్తున్నట్టు జిల్లా సంఘ ముఖ్య ప్రతినిధులు కేకే రామిరెడ్డి, శ్యామలరా వు, కె.చిరంజీవి తెలిపారు. టెక్కలి ప్రభుత్వ ఉన్నత మైదానం వేదికగా శనివారం ఉదయం 10 గంటలకు ఈ ఎంపికల ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. ఇక్కడ ఎంపికైన జిల్లా జట్లను ఈనెల 25 నుంచి పల్నాడు జిల్లా నకరికల్లులోని ఎస్‌వీవీఆర్ జేపీ హైస్కూల్ వేదికగా జరిగే ఏపీ రాష్ట్రస్థాయి ఆట్యా–పాట్యా చాంపియన్‌షిప్–2025 పోటీలకు పంపించనున్నట్టు వారు చెప్పారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు తమ జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డుతో ఎంపికలకు హాజరుకావాలని, మరిన్ని వివరాలకు 94409 41974 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
థర్మల్ సర్వేను అడ్డుకున్న గిరిజనులు
సరుబుజ్జిలి: థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకోసం జరుగుతున్న డ్రోన్ సర్వేను వెన్నెలవలస వద్ద గురువారం గిరిజనులు అడ్డుకున్నా రు. వెన్నెలవలస సమీపాన ఏపీజెన్‌కో డిప్యూ టీ ఈఈ తిప్పాన హరిరెడ్డి, ఏపీశాక్ సైంటిస్ట్ తాతబాబు ఆధ్వర్యంలో డ్రోన్ సర్వే నిర్వహిస్తుండగా పలువురు గిరిజనులు వారి వద్ద ను న్న సర్వే పరికరాల తీసుకొని సర్వేను అడ్డగించారు. దీంతో అఽధికారులు పోలీసులకు ఫిర్యా దు చేశారు. ఆమదాలవలస సీఐ సత్యనారాయణ, బూర్జ ఎస్‌ఐ మొజ్జాడ ప్రవల్లిక ఘటనా స్థలానికి వచ్చి గిరిజనులతో మాట్లాడి పరికరాలను అధికారులకు అప్పగించారు. అధికారు లు సర్వే చేయకుండా వెనుదిరిగారు. మానవాళి మనుగడకు ముప్పు వాటిల్లే థర్మల్‌కు వ్యతిరేకంగా పోరాడుతామని గిరిజనులు స్పష్టం చేశారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉచిత బస్సు పథకం వల్ల ఉపాధి నష్టపోతున్న ఆటో, మ్యాక్సీ, క్యాబ్, డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ.30 వేలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు గురువారం శ్రీకాకుళం ఆర్‌అండ్‌బీ బంగ్లా నుంచి కలెక్టర్ కార్యాలయం వద్ద ర్యాలీ నిర్వహించి అనంతరం జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రైవర్లకు పీఎఫ్, ఈఎస్‌ఐలతో కూడిన సంక్షేమాలు అమలు చేయాలన్నారు. నిరుద్యోగ సమస్య వల్ల అప్పులు చేసి ఆటోలు కొనుక్కుని తిప్పుతున్నారని, ఇప్పుడు బేరాలు తగ్గిపోవడంతో కుటుంబ పోషణ భారమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజంతా ఆటో, వ్యాన్లు నడిపినా పూట గడవడం లేదన్నారు. ఫైనాన్స్ కట్టలేక మాట పడాల్సి వస్తోందన్నారు. డీజిల్, పెట్రోల్‌పై వ్యాట్, సెస్ ఎత్తివేయాలని కోరారు. ధర్నాలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్‌వీ ర మణ, జిల్లా ఉపాధ్యక్షులు ఎం.ఆదినారాయణమూర్తి, కె.సూరయ్య, ఆటో యూనియన్ నాయ కులు ఎం.జగన్నాథం, పి.మోహనరావు, ఎం.కామేశ్వరరావు, ఎం.రామారావు, తమ్మినేని చంద్రునాయుడు పాల్గొన్నారు.