
తహసీల్దార్‌ను ప్రశ్నించిన లీజుదారులు..
గ్రావెల్ లీజుకు అనుమతులు ఉన్నా స్థానిక ఎమ్మెల్యే అనుచరులు ఇబ్బంది పెడుతున్నారని లంకలపల్లి శంకరరావు ఆవేదన వ్యక్తం చేశారు. వాహనం ధ్వంసం చేశారని దీనిపై పోలీసులను ఆశ్రయిస్తామన్నారు. ఇదే కొండలో గత వారం రోజులుగా ఎలాంటి అనుమతులు లేకుండా వేలాది గ్రావెల్ లోడ్లు ఎలా తరలించారని, దీని వెనుక ఎవరున్నారని తహసీల్దార్‌ను ప్రశ్నించారు. అలాగే కూన రవికుమార్ అనుచరుడు సీహెచ్ శ్రీనివాస్ కూడా తహసీల్దార్‌తో వాగ్వాదం చేశారు. అనుమతులపై అభ్యంతరాలు ఉంటే భూగర్భ గనుల శాఖ ఈనెల 2వ తేదీన రూ. 25వేల సీనరేజీ ఫీజు ఎలా కట్టించుకుందని, సమస్య ఉంటే కట్టించకోరు కదా, ఇదే కొండలో పక్కన అనుమతుల్లేకుండా వేలాది లోడ్లు తరలించారు, వాటిని ఏ అధికారైనా పట్టుకున్నారా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంలో కూన రవికుమార్ ఫోన్ చేస్తున్నారు.. చూడండి అని తహసీల్దార్‌కు చెప్పగా ఈ సమయంలో ఫోన్ లిఫ్ట్ చేయలేమని చెప్పేశారు.

తహసీల్దార్‌ను ప్రశ్నించిన లీజుదారులు..