
కొత్తమ్మ తల్లి ఉత్సవాలకు పటిష్ట భద్రత
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండల కేంద్రంలో గల కొత్తమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలను ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలకు పటిష్ట భద్రత ఏర్పా టు చేయనున్నట్లు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. గురువారం అయన జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌తో కలసి అలయ ప్రాంగణం పరిశీలించారు. ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు, డ్రోన్‌లతో పర్యవేక్షణ చేయనున్నట్లు తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు, రెవెన్యూ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా కళాఉత్సవం పోటీలు
గార: వమరవల్లి డైట్‌లో జిల్లాస్థాయి కళా ఉత్స వం పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యా యి. రెండు రోజుల పాటు జరగనున్న ఈ పోటీలను గురువారం సమగ్ర శిక్షా ఏపీసీ శశిభూషణరావు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఏపీసీ శశిభూషణ రావు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉండే ప్రతిభను వెలికితీసి వారిని ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రిన్సిపాల్ గౌరీ శంకర్ మాట్లాడుతూ జిల్లాస్థాయి విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. తొలిరోజు దాదా పు 40 మంది విద్యార్థులు పాల్గొన్నారు. గాత్ర సంగీతంలో వందరాపు జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థి వెంకటేష్, వాయిద్య సంగీతంలో ముత్యాలపేట స్కూల్ విద్యార్థిని సీహెచ్ వర్షిణి, గ్రూప్ సాంగ్‌లో టెక్కలి ఎంజేపీ ప్రథమ బహుమతి సాధించారు. కార్యక్రమంలో తాడేల వెంకటరావు, డైట్ లెక్చరర్లు, పలు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కొత్తమ్మ తల్లి ఉత్సవాలకు పటిష్ట భద్రత