మూలపేటపై అధికారమదం | - | Sakshi
Sakshi News home page

మూలపేటపై అధికారమదం

Sep 5 2025 7:39 AM | Updated on Sep 5 2025 7:39 AM

మూలపే

మూలపేటపై అధికారమదం

అధికార పార్టీకి చెందిన వారేమో యథేచ్ఛగా దాడులకు పాల్పడతారు. ఇష్టం వచ్చిన సమయానికి ఇంటికి వచ్చి మరీ బెదిరిస్తారు. కానీ వీరిపై ఎలాంటి చర్యలు ఉండవు. ఇంటికొచ్చి కొట్టినా ఏమీ కానట్టే ఖాకీలు వ్యవహరిస్తారు. విపక్ష నాయకుడైతే మాత్రం గల్లా పట్టుకుని స్టేషన్‌కు తీసుకెళ్లేంత తెగువ చూపిస్తారు. ఎందుకని ప్రశ్నిస్తే దాడి చేయడానికి కూడా వెనుకాడరు. సంతబొమ్మాళి మండలం మూలపేటలో పరిస్థితి ఇది. ఏ రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నారో గానీ ఇక్కడ ప్రాథమిక హక్కులకు రక్షణ లేకుండాపోయింది.

బుధవారం మూలపేట సర్పంచ్‌ ఇంటిపై దాడికి ప్రయత్నిస్తున్న టీడీపీ నాయకుడు జీరు భీమారావు తదితరులు

సంతబొమ్మాళి: మండలంలోని మూలపేటపై రెడ్‌ బుక్‌ రాజ్యాంగం పడగ నీడ పడింది. అందరినీ సమదృష్టితో చూసి శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు అధికార పక్షమైతే ఒకలా, విపక్షమైతే మ రోలా ప్రవర్తిస్తున్నారు. ఈ వైఖరి గ్రామంలో సమస్యలు రేకెత్తిస్తోంది. ఈ గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త, సర్పంచ్‌ తమ్ముడైన జీరు విశ్వనాథంపై నౌపడ ఎస్‌ఐ నారాయణస్వామి దాడి చేయడంతో గ్రామస్తులంతా పోలీస్‌స్టేషన్‌ ముందు గురువారం నిరసన చేపట్టారు. మూలపేట సర్పంచ్‌ జీరు బాబూరావు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..

మూలపేట గ్రామానికి చేపల కట్టు వేలంపాట, ఇతర మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థాని క సర్పంచ్‌ జీరు బాబూరావు ఆధ్వర్యంలో గ్రామానికి వచ్చిన డబ్బులను 12 మంది కమిటీ సభ్యులను ఏర్పాటు చేసి వారి అకౌంట్లో రూ. 32 లక్షలు జమ చేశారు. అలాగే గ్రామానికి చెందిన మరో నలుగురి ఖాతాల్లో రూ. 40లక్షలు జమ చేశారు. గ్రామానికి సంబంధించి ఏవైనా కార్యక్రమాలు జరిగితే ఈ డబ్బు ఖర్చు చేసేవారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామానికి సంబంధించిన డబ్బులు తమకు ఇవ్వాలని టీడీపీ మండలాధ్యక్షుడు, మాజీ సర్పంచ్‌ జీరు భీమారావు అడిగారు. మీ హయాంలో మీ వద్దనున్న రూ.60లక్షల ఏమయ్యావో చెప్పాలని, ఆ డబ్బు ఊరికి ఇస్తే తమ వద్ద ఉన్న డబ్బులు అప్పగిస్తానని సర్పంచ్‌ బాబూరావు సమాధానం ఇచ్చారు. దీనిపై వివాదం చెలరేగింది. డబ్బుల కోసం పోలీసుల ద్వారా కూడా ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో టీడీపీ నాయకుడు జీరు భీమారావు ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు బుధవారం సాయంత్రం మూలపేట సర్పంచ్‌ జీరు బాబూరావు ఇంటికి వెళ్లారు. ఆయన లేకపోవడంతో సర్పంచ్‌ తండ్రిపై దాడి చేశారు. గ్రామంలో గొడవలు వద్దని విషయం తెలిసినా సర్పంచ్‌ బాబూరావు మిన్నకుండిపోయారు. కానీ గురువారం టీడీపీ నాయకుల ఒత్తిడితో రొయ్యల చెరువు వద్ద ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్త మంగి రామారావును పోలీస్‌ స్టేషన్‌కు తీసుకుని రావడానికి నౌపడ ఎస్‌ఐ నారాయణస్వామి ప్రయత్నించారు. ఎందు కు తీసుకెళ్తున్నారని ప్రశ్నించిన సర్పంచ్‌ తమ్ముడు జీరు విశ్వనాథంపైన ఎస్‌ఐ ఇష్టానుసారం దాడి చేశారు. ముఖం, గుండైపెన చేతులతో దాడి చేసి షర్టు చింపి వేసి అక్కడ ఉన్న మంగి రామారావును పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లిపోయారు. గాయపడిన జీరు విశ్వనాథం టెక్కలి జిల్లా ఆస్పత్రిలో చేరారు. దీనిపై ఊరుఊరంతా మండిపడింది. మహిళలతో పాటు గ్రామస్తులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి నిరసన తెలిపారు. మంగి రామారావును విడిచి పెట్టేంత వరకు వెళ్లబోమని తేల్చి చెప్పారు. విచారించి కొద్దిసేపట్లో విడిచిపెడతామని పోలీసులు చెప్పడంతో సర్పంచ్‌ జీరు బాబూరావుతో పాటు గ్రామస్తులు వెను తిరిగారు. దీనిపై గ్రామస్తులు టెక్కలి డీఎస్పీకి ఫిర్యాదు చేశారు.

నడిరోడ్డుపై నిలదీత

గ్రామాల్లో తగాదాలకు కారణమవుతున్న టీడీపీ మండలాధ్యక్షుడు, మూలపేట మాజీ సర్పంచ్‌ జీరు భీమారావును నౌపడలో నడి రోడ్డుపైన మహిళలు, గ్రామస్తులు నిలదీశారు. మంగి రామారావును పోలీస్‌ స్టేషన్‌కు తీసుకుని రావడానికి జీరు భీమారావే కారణమని తెలుసుకున్న గ్రామస్తులు అతని ఇంటికి వెళ్లడానికి బయల్దేరగా.. సమాచారం తెలుసుకున్న జీరు భీమారావు తన ఇంటి నుంచి వేరొక చోటకు వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. అయితే నౌపడ మెయిన్‌రోడ్డులో ద్విచక్ర వాహనంపై వస్తు న్న జీరు భీమారావుని మహిళలు, గ్రామస్తులు అడ్డుకొని నిలదీశారు. గ్రామానికి సంబంధించిన రూ.రెండు లక్షల నలౖభై వేలు నగదు, 40 సిమెంట్‌ బస్తాలు 2014లో అప్పుగా తీసుకొని అంతవరకు ఒక్క పైసా కూడా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. వడ్డీతో సహా తక్షణమే చెల్లించాలని అన్నారు. అధికారాన్ని ఉపయోగించి భయపెట్టాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. మహిళలు, గ్రామస్తులు నిలదీయడంతో భయపడి నౌపడ పోలీస్‌ స్టేషన్‌లో దాక్కున్నారు.

మూలపేటలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై

ఎస్‌ఐ దాడి

దాడిని నిరసిస్తూ పోలీస్‌స్టేషన్‌ ముందు నిరసన

టెక్కలి డీఎస్పీకి ఫిర్యాదు

మూలపేటపై అధికారమదం1
1/1

మూలపేటపై అధికారమదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement