
రెడ్‌బుక్ రాజ్యాంగం హద్దు మీరుతోంది
● వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్
● టెక్కలి డీఎస్పీ కార్యాలయం ముట్టడి
టెక్కలి: రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేయడం కోసం టెక్కలి నియోజకవర్గంలో పోలీసులు హద్దు మీరుతున్నారని వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్ మండిపడ్డారు. సంతబొ మ్మాళి మండలం మూలపేట గ్రామానికి చెందిన జీరు విశ్వనాథంపై నౌపడ ఎస్‌ఐ నారాయణస్వామి విచక్షణ రహితంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని తిలక్ పరామర్శించారు. ఎస్‌ఐ నారాయణస్వామి తీరును తప్పుబడుతూ మూలపేట గ్రామస్తులంతా టెక్కలి డీఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం పేరాడ తిలక్‌తో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు, మూలపేట గ్రామస్తులు డీఎస్పీ లక్ష్మణరావును కలిసి ఫిర్యాదు చేశారు. నౌపడ ఎస్‌ఐతో పాటు సీఐ చేస్తున్న విధ్వంసాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలన్నారు. అచ్చెన్నాయుడు చెప్పాడని, మూలపేటలో భీమారావు చెప్పాడని పోలీసులు అన్యాయంగా ప్రవర్తిస్తే సహించేది లేదని తిలక్ అన్నారు. ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయనతో పాటు మూలపేట సర్పంచ్ జీరు బాబు రావు, సంతబొమ్మాళి పార్టీ అధ్యక్షుడు బి.మోహన్‌రెడ్డి, నాయకులు కె.గోవింద్, ఎం.అప్పారావు, దొర, ఎం.నాగభూషణ్ తదితరులు ఉన్నారు.

రెడ్‌బుక్ రాజ్యాంగం హద్దు మీరుతోంది