
కన్నబాబుకు ధర్మాన పరామర్శ
శ్రీకాకుళం రూరల్: మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు తండ్రి సత్యనారాయణ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో వారి కుటుంబాన్ని మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు కాకినాడలోని వారి నివాసంలో బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ నర్తు రామారావు, పార్టీ రాష్ట్ర తూర్పుకాపు అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్, నాయకులు బలగ ప్రకాశ్, చిట్టి రవికుమార్, గంగు నరేంద్రకుమార్, యాళ్ల శ్రీను, బగ్గు అసిరినాయుడు, రెడ్డి తాతబాబు, గంగు సీతాపతి తదితరులు ఉన్నారు.