
వానా.. హైరానా
● జిల్లాలోని పలుచోట్ల ముంచెత్తిన వర్షం
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జిల్లాలో గత రెండు రోజులుగా వర్షాలు ముంచెత్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలువలు, చెరువులు, రోడ్లు, పంట పొలాల్లోకి వరద నీరు చేరింది. వజ్రపుకొత్తూరు మండలంలోని నగరంపల్లి ప్రాథమిక పాఠశాలలోకి, పూండి గల్లిలోని పాఠశాలలోకి వర్షపు నీరు చేరడంతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. గరుడఖండి – బ్రహ్మణతర్లా వద్ద ఉన్న అండర్ పాసేజ్ బ్రిడ్జి నీటితో నిండిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నరసన్నపేట మండలంలోని గొట్టిపల్లి మార్గంలో ఉన్న స్వయంభూ ఉమామహేశ్వర స్వామి ఆలయం వర్షానికి నీట మునిగింది. దీంతో భక్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అదేవిధంగా టెక్కలి మండలం పెద్దరోకళ్లపల్లి గ్రామ సమీపంలో గెడ్డ ప్రవాహం ఉధృతంగా మారింది. దీంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే పాతపట్నంలో మహేంద్రతనయా నది పొంగిపొర్లుతోంది. పాతపట్నం నీలకంఠేశ్వరం ఆలయం వద్ద ఉన్న కాజ్‌వే బ్రిడ్జిపై నుంచి రెండు అడుగుల నీరు పారుతోంది.
– సాక్షి నెట్‌వర్క్

వానా.. హైరానా

వానా.. హైరానా

వానా.. హైరానా