
నేడు యూరియా కొరతపై ర్యాలీ
నరసన్నపేట: జిల్లాలో యూరియా కొరతపై రైతులకు మద్దతుగా సోమవారం శ్రీకాకుళం డివిజన్ పరిధిలోని నాలుగు నియోజకవర్గా ల రైతులతో ర్యాలీ కార్యక్రమం ఉందని, దీన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. ఉద యం 10 గంటలకు శ్రీకాకుళంలోని జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి జిల్లా పరిషత్ సమావేశ మందిరం వరకూ ర్యాలీ ఉంటుందని తెలిపా రు. శ్రీకాకుళం, నరసన్నపేట, ఎచ్చెర్ల, ఆమదాలవలస నియోజకవర్గాలకు చెందిన రైతు సోద రులు, వైఎస్సార్ సీపీ శ్రేణులు పాల్గొనాలని కోరారు. ఈ మేరకు ఆదివారం రాత్రి కృష్ణదాస్ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇచ్ఛాపురం రూరల్: సాగునీరు లేక నారుమడులు, నాట్లు ఎండిపోతున్న దశలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి పంట పొలాలు నీటితో నిండిపోయాయి. ఈ వర్షం కొబ్బరి తోటలకు ఎంతగానో మేలు చేసిందని కొబ్బరి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రసుత్తం కురిసిన వర్షం వల్ల నాట్లకు చీడ,పీడలు తొలగిపోతాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
ఇచ్ఛాపురం రూరల్: ఈదుపురంలో జ్వరాలు ప్రబలుతున్నాయి. ఇక్కడ ప్రభుత్వాస్పత్రి ఉన్నప్పటికీ వైద్యాధికారి చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారు. దీంతో స్థానికులకు అవస్థలు తప్పడం లేదు. ఫలితంగా రోగులు ప్రైవేటు వైద్యులు, ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. ప్రతి వీధిలో జ్వర పీడితులు కనిపిస్తున్నారు.
శ్రీకాకుళం అర్బన్: క్రీడలతోనే మానసిక ఉల్లాసం లభిస్తుందని తపాలాశాఖ సూపరింటెండెంట్ వండాన హరిబాబు అన్నారు. పోస్టల్ డివిజన్ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళంలోని ప్రధాన తపాలాశాఖ కార్యాలయం వద్దన ఉన్న మున్సిపల్ మైదానంలో ఆదివారం ఉదయం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ ఒత్తిడి స్థాయిని తగ్గించడంలో, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంలో క్రీడలు ఎంతో దోహదపడతాయని అన్నారు. జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా ఆగస్టు 29 నుంచి పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో ‘ప్రతిరోజు ఒక గంట మైదానంలో ఆడండి’ అనే థీమ్‌తో ఫిట్ ఇండియా కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. మూడు రోజులు గా ఫిట్‌నెస్ ప్రతిజ్ఞ, విద్యార్థులతో చర్చలు వంటి కార్యక్రమాలు చేపట్టి ఈ ఆదివారం ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్‌లో సైకిల్ ర్యాలీ తో కార్యక్రమాలను ముగించినట్లు తెలిపారు.

నేడు యూరియా కొరతపై ర్యాలీ

నేడు యూరియా కొరతపై ర్యాలీ

నేడు యూరియా కొరతపై ర్యాలీ