
‘యూపీహెచ్‌సీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి’
శ్రీకాకుళం అర్బన్: అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ల లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని యూ పీహెచ్‌సీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.సింహాచలం కోరారు. శ్రీకాకుళంలోని ఎన్‌జీవో కార్యాలయంలో ఆదివారం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఎంప్లాయీస్ యూనియన్ శ్రీకాకుళం జిల్లా కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన యూపీహెచ్‌సీ ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.సింహాచలం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో యూపీహెచ్‌సీ ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు మెరుగైన వేతనాలు, సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌లో ఉన్న సాంకేతిక సమస్యలు పరిష్కారం చేయకుండా చిరు ఉద్యోగుల జీతాల్లో కోతలు విధిస్తాం అంటూ ఆదే శాలు జారీ చేయడాన్ని ఖండించారు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనియన్ జిల్లా అధ్యక్షురాలిగా బి.మాలతి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా డీఎస్ సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా జి.సూర్య ప్రవీణ్, కోశాధికారిగా పి. ఉపేంద్ర, వర్కింగ్ ఉమెన్స్ వింగ్ అధ్యక్షురాలిగా జి.కల్యాణి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా టి.లక్ష్మి, జాయింట్ సెక్రెటరీగా బి.శ్రీనివాసరావు తదితరులు ఎంపికయ్యారు.