
చంద్రబాబు మోసకారి
సరుబుజ్జిలి: ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నిక హామీలు తుంగలోకి తొక్కి ప్రజలను మోసగించారని వైఎస్సార్‌సీపీ విజయనగం జిల్లా పార్లమెంటరీ పరిశీలకుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిల్లి వెంకటగోపాల సత్యనారాయణ(కేవీజీ) ధ్వజమెత్తారు. సరుబుజ్జిలి మండలంలోని పలు గ్రామాల్లో శనివారం పర్యటించిన అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడారు. రైతన్నలు బస్తా ఎరువు కోసం గంటలకొద్దీ క్యూలైన్లలో నిలబడి సొమ్మసిల్లిపడిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. జిల్లాకేంద్రాల నుంచి లారీల ద్వారా వచ్చిన ఎరువులను కూటమి నేతలు అడ్డదారుల్లో తరలించి కార్యకర్తలకు అందిస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ పరిస్థితి లేదన్నారు. స్థానిక వ్యవసాయాధికారి ఎరువుల వ్యాపారులు, కూటమి నేతలకు కొమ్ముకాస్తూ రైతన్నలను తీవ్ర బ్బందులకు గురిచేస్తున్నారని, పనితీరు మార్చుకోవాలన్నారు.