
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం అర్బన్: ఆర్టీసీలో రిటైరైన, చనిపోయిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్ క్యాష్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఏపీపీటీడీ (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు డిమాండ్ చేశారు. శనివారం శ్రీకాకుళంలోని రెవెన్యూ భవన్‌లో ఈయూ జిల్లా అధ్యక్షుడు జి.త్రినాథ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిటైర్డు ఉద్యోగులకు వైద్యసౌకర్యాలు, ఆర్టీసీ ఆసుపత్రుల్లో మందులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 11వ పీఆర్సీ బకాయిలు, ఎన్నికల హామీ మేరకు ఐఆర్ ప్రకటించి 12వ పీఆర్సీ కమిషన్ నియమించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి పి.భానుమూర్తి మాట్లాడుతూ సీ్త్రశక్తి ఉచిత బస్సు పధకం విజయవంతం కావాలంటే కనీసం 3000 కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, 10 వేల పోస్టులను భర్తీ చేయాలని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి పి.నానాజీ, ఏపీజేఏసీ అమరావతి శ్రీకాకుళం జిల్లా కంచరాన శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి సీపాన వెంకటరమణ, జోనల్ అధ్యక్షులు కె.జే.శుభాకర్, జోనల్ కార్యదర్శి బాసూరి కృష్టమూర్తి, కోశాధికారి జి.తాతాలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా కె.దశరథుడు (టెక్కలి డిపో), జిల్లా కార్యదర్శిగా గూనాపు త్రినాథ్ (శ్రీకాకుళం–1 డిపో), వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బి.టి.వి.శ్రీనివాస్ (పలాస), చీఫ్ వైస్ ప్రెసిడెంట్‌గా బత్తిన అప్పారావు (శ్రీకాకుళం– 2 డిపో), కోశాధికారిగా పి.వి.ఆర్.లలితకుమారి (శ్రీకాకుళం–1 డిపో), జాయింట్ సెక్రటరీగా బి.మురళిమోహన్, ప్రచార కార్యదర్శిగా వై.కె.కుమార్, ఉపాధ్యక్షుడిగా ఎస్.జోగారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా డి.వనజాక్షి, ఎం.సురేష్, అసిస్టెంట్ సెక్రటరీలుగా వి.డి.రావు, సి.ఎస్.కుమార్ తదితరులు నియమితులయ్యారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఈయూ నాయకులు కె.బాబూరావు, ఎస్‌వి రమణ, కె.గోవిందరా తదితరులు పాల్గొన్నారు.