
అనుపోత్సవాలకు పటిష్ట భద్రత
శ్రీకాకుళం క్రైమ్ : శ్రీకాకుళం సబ్ డివిజన్ పరిధిలో 2072 వినాయకుని మండపాల్లో ఆన్‌లైన్ సింగిల్ విండో పద్ధతి అనుమతులతో ప్రజలు ఉత్సవాలు నిర్వహిస్తున్నారని డీఎస్పీ సీహెచ్ వివేకానంద శనివారం తెలిపారు. వినాయక విగ్రహ ఊరేగింపు, నిమజ్జన కార్యక్రమాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. శ్రీకాకుళం నగరంలో పెద్ద విగ్రహాలున్న సుమారు 25 మండపాల్లో సీసీ కెమెరాల నిఘా ఉందన్నారు. ఈ నెల 31న డివిజన్ పరిధిలో 400 విగ్రహాలు అనుపోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని, వచ్చే నెల 2న 275, 4న 425, తొమ్మిదో రోజైన 6న 500 విగ్రహాలు, 8న 50 వరకు అనుపునకు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. మద్యం సేవించి ఊరేగింపులో న్యూసెన్సు సృష్టించేవారిపై ప్రత్యేక దృష్టిపెట్టామని, గతేడాది వినాయక ఉత్సవాల్లో అల్లర్లు చేసేవారిపై ఇప్పటికే బైండోవర్లు కట్టామని, వారితో పటు ఇటీవల గొడవల్లో ఉన్నవారిపై షీట్లు తెరిచామన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో మండపాలకు అనుమతించలేదన్నారు.