శ్రీకాకుళం | - | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం

May 1 2025 1:22 AM | Updated on May 1 2025 1:22 AM

శ్రీక

శ్రీకాకుళం

ఆటాడుకుందాం రా..!నేటి నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభం కానున్నాయి. ఏర్పాట్లు పూర్తయ్యాయి. –8లో
తమ్ముళ్లకు వెన్నుపోటు

గురువారం శ్రీ 1 శ్రీ మే శ్రీ 2025

నరసన్నపేట నియోజకవర్గ కీలక నేత చేతిలో మోసపోయిన తెలుగు తమ్ముళ్లు

మద్యం వ్యాపారంలో వాటాలిస్తామని రూ. 20కోట్లకు పైగా సేకరణ

వసూలయ్యాక మాట మార్చిన కీలక నేత

లబోదిబోమంటున్న తమ్ముళ్లు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :

ప్రెవేటు మద్యం దుకాణాలు వస్తున్నాయనగానే తెలుగు తమ్ముళ్లు సంబరపడ్డారు. ఎవరికీ దక్కకుండా దుకాణాలు కొట్టేద్దామని భావించారు. నాయకులంతా సిండికేటై దుకాణాలన్నీ గుప్పెట్లోకి తెచ్చుకోవాలని కలలు కన్నారు. ఇంకేముంది నరసన్నపేట నియోజకవర్గ కీలక నేత సిండికేట్‌కు నాయకత్వం వహించారు. అంతా కలిసి వ్యాపారం చేసుకుందామని గ్రామాల వారీగా నాయకుల నుంచి పెట్టుబడి కింద రూ. 20కోట్లకు పైగా వసూలు చేశారు. కానీ అనుకున్నదొకటైతే జరిగింది మరొకటి అయింది. డబ్బులిచ్చిన నాయకుల పేరున కాకుండా తన కుటుంబ సభ్యుల చేత నియోజకవర్గంలోని దుకాణాలకు దరఖాస్తు చేయించారు. వా టిలో కొన్ని దుకాణాలు లాటరీలో వారికే దక్కాయి. ఇతరులకు వచ్చిన మరికొన్ని దుకాణాలను భయపెట్టి తన సిండికేట్‌లో కలిపేసుకున్నారు. అంతా అయ్యాక సిండికేట్‌ వ్యాపారం కోసం గ్రామాల వారీగా భారీగా డబ్బులిచ్చిన నాయకులను విస్మరించారు. వ్యాపారంలో కలుపుకోకపోగా వారిచ్చిన డబ్బులు కూడా వెనక్కి ఇవ్వడం లేదు. పెట్టుబడి కోసం వివిధ వ్యక్తుల వద్ద వడ్డీలకు తీసుకొచ్చిన సొమ్ము ఆ కీలక నేత చేతిలో ఉండిపోయిందని లబోదిబోమంటున్నారు.

ఫ్యామిలీ ప్యాకేజీ..

నరసన్నపేట నియోజకవర్గంలో కీలక నేత పంట పండింది. అటు మద్యం, ఇటు ఇసుక ద్వారా రోజు కి రూ.కోట్లలో ఆర్జిస్తున్నారు. దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలన్న ఆ నేత రెండు చేతులా సంపాదిస్తున్నారు. కానీ, ఆయన్ని నమ్మి వెనుక నడిచిన నాయకులు మాత్రం చాలా వరకు మోసపోయారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి నష్టపోతున్నారు. నరసన్నపేట నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. అక్కడి కీలక నేత ఒకరు అంతా తానై వ్యవహరించారు. మద్యం వ్యాపారం కలిసి చేసుకుందామని నమ్మబలికి నాయకుల దగ్గరి నుంచి రూ. 20కోట్లకు పైగా సొమ్ము సేకరించారు. డబ్బులిచ్చిన ప్రతి ఒక్కరికీ వ్యాపారంలో వాటా

కావాల్సిన

వారికి

ఇసుకలో

వాటా

మద్యం వ్యాపారం కోసం డబ్బులిచ్చిన వారిలో తనకు కావాల్సిన కొందరికి మాత్రం ఇసుకలో వాటాలిచ్చారు. తప్పని పరిస్థితుల్లో అనధికారికంగా నడిపే ర్యాంపుల్లో కొంత పర్సంటేజీ ఇచ్చారు. పైసా పెట్టుబడి లేని వ్యాపారం కావడంతో ఇసుక ర్యాంపులను కీలక నేత వదిలేశారు. ముఖ్యంగా నరసన్నపేట, పోలాకి, జలుమూరు తీర ప్రాంత గ్రామాలకు చెందిన నాయకుల్లో బలమైన వ్యక్తులకు మాత్రమే ఈ ఆఫర్‌ ఇచ్చారు. మిగతా వారిని సముదాయిస్తూ వస్తున్నారు. ఒకే దుకాణానికి ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వేయడం వల్ల ఆ ఫీజు కింద చాలా వరకు పోయిందని, అనుకున్నంతగా లాభాలు కూడా రావడం లేదని, ఇప్పుడిప్పుడే బెల్ట్‌ దుకాణాల ద్వారా ఆదా యం పెరిగిందని, త్వరలోనే వ్యాపారం కోసం ఇచ్చినదంతా వెనక్కి ఇచ్చేస్తానంటూ కాలయాపన చేస్తూ వస్తున్నారు. ఇప్పుడా నేత తీరుపై మిగతా ప్రజలు పక్కన పెడితే సొంత నాయకులే కస్సుబుస్సులాడుతున్నారు.

ఇస్తామని చెప్పారు. నాయకుల పేరునే దుకాణాల కోసం దరఖాస్తులు చేయిస్తామని భరోసా ఇచ్చారు. కానీ, దరఖాస్తుల ప్రక్రియకు వచ్చేసరికి తన కు టుంబ సభ్యుల పేరున ఎక్కువగా దరఖాస్తులు చేశారు. ఒక్కో దుకాణానికి 30నుంచి 70వరకు దరఖాస్తులు చేసినప్పటికీ ఆ కుటుంబ సభ్యులకే లాటరీలో ఎక్కువగా దుకాణాలు వచ్చాయి.

న్యూస్‌రీల్‌

హ్యాండ్‌ ఇచ్చిన కీలక నేత

దుకాణాలు దక్కాక ఆ నేత మొహం చాటేస్తున్నారు. వాటా సంగతేంటని అడిగితే దాట వేస్తున్నారే తప్ప లబ్ధి చేకూర్చడం లేదు. ఎప్పటికీ వాటాలు ఇవ్వడం లేదని కొందరు విసిగి పోయి అడుగుతుంటే ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. తరచూ అడిగే వాళ్లకు వడ్డీతో కలిపి చెల్లించేస్తానని చెప్పడమే తప్ప వెనక్కి ఇచ్చిన దాఖాల్లేవు. ఒకవైపు వడ్డీలు పెరిగిపోతున్నాయి, మరోవైపు కీలక నేత వెనక్కి ఇవ్వడం లేదు. దీంతో నాయకులంతా కుమిలిపోతున్నారు. గట్టిగా అడిగితే అధికారం ఉండటంతో ఏం చేస్తారోనన్న భయంతో ప్రాధేయ పడుతూ వస్తున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో సమావేశాలు పెట్టుకుని కీలక నేత తీరుపై ఆవేదన వ్యక్తం చేయడమే కాకుండా ఏం చేస్తే...ఆ డబ్బులు వెనక్కి వస్తాయో అన్నదానిపై సమాలోచనలు చేస్తున్నారు.

శ్రీకాకుళం1
1/3

శ్రీకాకుళం

శ్రీకాకుళం2
2/3

శ్రీకాకుళం

శ్రీకాకుళం3
3/3

శ్రీకాకుళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement