
దశాబ్దాల కలకు ప్రతిరూపం..
పీహెచ్‌సీ కోసం లింగాలవలస గ్రామం దశాబ్దాల తరబడి ఎదురు చూసింది. వైఎస్సార్‌సీపీ హయాంలో గానీ ఆ ఊరి ఆశలు నెరవేరలేదు. టెక్కలి మండలం లింగాలవలసలో సుమారు రూ.2.30 కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించారు. నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్న సమ యానికి ఎన్నికలు రావడం...ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది.
ఇటీవలే ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. లింగాలవలసతో పాటు సొర్లిగాం, సవరసొర్లిగాం, రంగాపురం, మెట్టపేట, ఏనేటిపేట, సతివాడ, సన్యాసిపేట, ఆర్.వి.పురం, లక్ష్మీపురం, పోలవరం, గంగాధరపేట, నీలాపురం, వీఆర్‌కె.పురం, బొరిగిపేట, తిర్లంగి, సీతాపురం తదితర గ్రామాల ఆరోగ్య సేవలకు ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆసరాగా నిలుస్తోంది.
– టెక్కలి