అవినీతి ఆరోపణలు | - | Sakshi
Sakshi News home page

అవినీతి ఆరోపణలు

May 30 2025 1:44 AM | Updated on May 30 2025 1:44 AM

అవినీతి ఆరోపణలు

అవినీతి ఆరోపణలు

వికృత చేష్టలు..

పొందూరు:

కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళలకు రక్షణ లేకుండాపోతోంది. ఇందుకు పొందూరు రెవెన్యూ కార్యాలయంలో గురువారం జరిగిన ఘటనే సాక్ష్యంగా నిలుస్తోంది. ఇక్కడి వాష్‌రూమ్‌కు వెళ్లిన ఓ మహిళా రెవెన్యూ ఉద్యోగిని వీడియో తీస్తూ కంప్యూటర్‌ ఆపరేటర్‌ సువ్వారి సన్యాసిరావు పట్టుబడిన సంగతి తెలిసిందే. సద రు మహిళా ఉద్యోగి వెంటనే స్పందించి ఫోన్‌లో వీడియోను డిలీట్‌ చేయించి తహశీల్దార్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి సన్యాసిరావు అవినీతిపరుడనే, మహిళలను వేధిస్తాడనే ఆరోపణలు ఉన్నాయి. తన మాట వినకపోతే పనులు చేయకుండా విసిగించడమే కాకుండా రాజకీయంగా పలుకుబడి ఉందని బెదిరిస్తూ మరింత రెచ్చిపోయేవాడు. ఈ విషయమై గతంలో కొంత మంది మహిళా ఉద్యోగులు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని, సన్యాసిరావు వికృత చేష్టలకు అంతులేకుండా పోయిందని మహిళా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సన్యాసిరావు ల్యాప్‌టాప్‌లో మరిన్ని వీడియోలు ఉండొచ్చని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకొని సమగ్ర విచారణ జరపాలని అధికారులను కోరుతున్నారు.

అంతా తానై..

తహశీల్దార్‌ వద్దకు ఏ ఫైల్‌ వెళ్లాలన్నా తన వద్దకు రావాల్సిందేనన్న స్థాయికి సన్యాసిరావు వెళ్లిపోయాడని కొందరు చెబుతున్నారు. రికార్డులు తారుమారు చేసి మ్యుటేషన్లు జరిపించడం కోసం రూ.లక్షల్లో లంచాలను రియల్టర్లు నుంచి తీసుకునేవాడని ఆరోపణలు ఉన్నాయి. 1–బీ ద్వారా బ్యాంకు నుంచి వ్యవసాయ రుణాలు పొందే సౌలభ్యాన్ని ఆసరాగా చేసుకుని కొంత మందికి లేని భూములకు 1–బీ సృష్టించేవాడని, వీటి ద్వారా రుణాలు పొందడంలో అక్రమాలకు సహకరించేవాడని సమాచారం. దేవదాయ భూముల రికార్డులు మార్చి అక్రమార్కులకు రెవెన్యూ పత్రాలు కట్టబెట్టడంలో ప్రధాన కారకుడు సన్యాసిరావు అనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై సమగ్ర విచారణ జరిపిస్తే మరిన్ని వాస్తవాలు వస్తాయని పలువురు అంటున్నారు.

అవార్డుకు అర్హుడా?

గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉద్యోగులకు ఇచ్చే అవార్డును సన్యాసిరా వు తీసుకోవడం గమనార్హం. అవినీతి ఆరోపణ లు ఉన్నప్పటికీ సన్యాసిరావు పేరు జాబితాలో చేర్చడంతో అప్పట్లో అంతా విస్తుపోయారు. ప్రస్తుతం మహిళల పట్ల అసభ్య వీడియోలు చిత్రీకరిస్తూ పట్టుబడటంతో అవార్డును వెనుక్కు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

వెలుగులోకి వస్తున్న సన్యాసిరావు లీలలు

వీడియో ఘటనపై భయాందోళనలో మహిళా ఉద్యోగులు

సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement