మా పార్టీ బలం ఇదీ.. అంటూ టీడీపీ చెప్పుకుంటున్న సభ్యత్వ నమోదు అసలు గుట్టు ఇలా రట్టయ్యింది. బీమా ఉంటుందని చెప్పి తోవలో వెళ్తున్న వారందరికీ వంద రూపాయలు తీసుకొని సభ్యత్యం కల్పించారు. నరసన్నపేట నియోజకవర్గంలో సభ్యత్వ కార్డుల పంపిణీ స్వయంగా ఎమ్మెల్యేనే చేపట్టారు. తీరా చూస్తే ఆ కార్డులు ఇలా రోడ్డు పాలవుతున్నాయి. గురువారం సాయంత్రం జాతీయ రహదారిపై నరసన్నపేట మండలం సత్యవరం కూడలి వద్ద నరసన్నపేట నుంచి శ్రీకాకుళానికి వెల్లే సర్వీసు రోడ్డు పక్కన పోగుగా సభ్యత్వ కార్డులు రోడ్డుపై కనిపించాయి. వీటిని కొందరు కార్యకర్తలే వేసినట్లు సమాచారం. – నరసన్నపేట