
శాకంబరిగా నీలమణిదుర్గ
పాతపట్నం: పాతపట్నంలోని ఉన్న శ్రీనీలమణిదుర్గ అమ్మవారిని ఆషాఢ మాసం సందర్భంగా శాకంబరిదేవిగా ఆదివారం అలంకరించారు. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, 700 కేజీల కూరగాయలు, పండ్లతో అమ్మవారిని ఆలంకరించారు.
చంద్రబాబు అరాచక పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్దాం
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
ధర్మాన కృష్ణదాస్
నరసన్నపేట: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ లు అమలు చేయకుండా డైవర్షన్ రాజకీయాలు చేస్తూ, అక్రమ అరెస్టులు, వైఎస్సార్ సీపీ నాయకులపై దాడులు చేయిస్తున్న చంద్రబాబు అరాచక పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ, రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంలో భాగంగా సోమవారం నుంచి నాలుగో స్థాయిలో పంచాయతీల్లో కార్యక్రమాలు జరగనున్నాయని వీటిల్లో కార్యకర్తలు, నాయకులు చురుకుగా పాల్గొని చంద్రబాబు మోసాలు ప్రజలకు వివరించాలన్నారు. ఇప్పటి వరకూ జిల్లా, ని యోజకవర్గం, మండల స్థాయిల్లో కార్యక్ర మాలు జరిగాయని తెలిపారు. ఈ మూడు స్థాయిల్లో కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా వి జయవంతం అయ్యాయని తెలిపారు. సోమ వారం నుంచి జూలై ఐదో తేదీలోగా పంచాయ తీ స్థాయిల్లో కార్యక్రమాలు నిర్వహించాలన్నా రు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
ఏకగ్రీవంగా జిల్లా వీఆర్వోల సంఘం కార్యవర్గ ఎన్నిక
టెక్కలి/ నరసన్నపేట: జిల్లా వీఆర్వోల సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర సంఘం ప్రదాన కార్యదర్శి మారెళ్ల అప్పలనాయుడు ఒక ప్రటకనలో తెలిపారు. జిల్లా అధ్యక్షునిగా ప్రగడ వేణుగోపాల్‌ను ఎన్నుకున్నామని తెలిపారు. ప్రస్తుతం అధ్యక్షునిగా ఉన్న రమేష్‌కుమార్ మన్యం జిల్లాకు బదిలీపై వెళ్లడంతో నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు ఆదివారం ఎన్నుకున్నామని తెలిపారు. జిల్లా కార్యదర్శిగా శ్రావణ్, ట్రెజరర్‌గా కేకే ప్రసాద్, ఉపాధ్యక్షులు పి.తిరుపతిరావు, ఈసీ సభ్యులుగా ఎస్.రామారావు, జాయింట్ కార్యదర్శులుగా కృష్ణంరాజు, ఇందిర ప్రియదర్శిని, స్పోర్ట్స్ అండ్‌కల్చర్ సభ్యునిగా బీవీఆర్ విశ్వేశ్వరరావు, కో ఆప్షన్ సభ్యులుగా ఇజాజ్‌లను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర సంఘానికి సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.
స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై అపోహలొద్దు
సాక్షి, విశాఖపట్నం : స్మార్ట్ మీటర్ల ఏర్పాటు విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదని, వీటితో వినియోగదారులపై అదనపు భారం ఉండే అవకాశమే లేదని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి స్పష్టం చేశారు. స్మార్ట్ మీటర్ల ప్రక్రియ విషయంలో వస్తున్న వదంతులపై ఆయన స్పందిస్తూ.. ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యుత్ వినియోగదారుల సేవల్లో పారదర్శకతను మరింత పెంచేందుకు ఆర్డీఎస్‌ఎస్ పథకంలో భాగంగా రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు జరుగుతోందని పేర్కొన్నారు. ఏపీఈఆర్సీ రెగ్యులేషన్ ప్రకారం ప్రభుత్వ, వాణిజ్య కేటగిరీల వినియో గదారులకు ప్రస్తుతం వీటిని అమర్చుతున్నామన్నారు. వీటితోపాటు ఎక్కువ విద్యుత్ వినియోగం కలిగిన (హై వాల్యూ) గృహ వినియోగదారులకు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏర్పాటు సమయంల వాటి ఖరీదు, చార్జీలు చెల్లించనక్కర్లేదన్నారు.

శాకంబరిగా నీలమణిదుర్గ

శాకంబరిగా నీలమణిదుర్గ