
బదిలీలు సరే.. జీతాలు వెయ్యరే..?
ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
ఉపాధ్యాయుల బదిలీల్లో స్థానచలనం కలిగిన ఉపాధ్యాయులకు ఇంకా జీతాలు అందలేదు. తీవ్ర జాప్యానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. తక్షణమే ప్రభుత్వం స్పందించి పొజిషన్ ఐడీలు జారీచేసి ఉపాధ్యాయులకు త్వరితగతిన జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలి.
– దుప్పల శివరాంప్రసాద్, ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు
డీఫాల్టర్లు అవుతున్నారు
ఉపాధ్యాయుల జీవితాలతో ఆటలాడుకోవడం మంచిది కాదు. జీతాలు లేని కారణంగా జిల్లాలో వేలాది ఉపాధ్యాయ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. జీతాలు రాక, ఈఎంఐలు కట్టలేక, చెక్ బౌన్సులు అవుతూ.. డీఫాల్డర్లు అవుతున్నారు. ఆగస్టు నెల జీతం కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదు.
– ఎండ ఉమాశంకర్, యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సెలర్
విద్యాశాఖను పట్టించుకున్న నాథుడే లేడు
రాష్ట్రంలో విద్యాశాఖను పట్టించుకున్న నాథుడే కరువయ్యా రు. ఇటు పాఠశాల విద్య, ఇంటర్‌విద్య, కాలేజియేట్ విద్య అంతా అస్తవ్యస్తంగానే ఉంది. సంబంధిత మంత్రి విద్యాశాఖమంత్రి తన శాఖను గాలికొదిలేశారు.
– మజ్జి మదన్‌మోహన్, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
●
శ్రీకాకుళం న్యూకాలనీ: పాఠశాల విద్యాశాఖలో జరిగిన బదిలీల్లో స్థానచలనం కలిగిన ఉపాధ్యాయులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. వారికి రెండు నెలలుగా జీతాలు చెల్లించకుండా అవస్థల పాలు చేస్తోంది. బదిలీలను సాకుగా చూపి జీతాలు చెల్లించకుండా కాలయాపన చేస్తోందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి విద్యాశాఖను గాలికొదిలేశారని అంటున్నారు.
జిల్లాలో 4వేల మందికిపైనే..
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఉపాధ్యాయుల సాధారణ బదిలీల్లో మొత్తం 6392 మంది ఉపాధ్యాయులు దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో 3546 మందికి బదిలీలు చేశారు. మరో 124 మందికి పదో న్నతులు కల్పించారు. గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు 107 మందికి, మోడల్ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా 118 మందికి, స్కూల్ అసిస్టెంట్, సమాన స్థాయి కేడర్ ఉపాధ్యాయులు గా 1217 మందికి, సెకండరీ గ్రేడ్, సమాన స్థాయి కేడర్ ఉపాధ్యాయులుగా 1962 మందికి, లాంగ్వేజ్ పండితులు 142 మంది ఉన్నారు. వీరిలో రీ అపోర్షన్ పోస్టుల్లో చేరిన 1521 మంది టీచర్లతోపాటు, రేషనలైజేషన్ కారణంగా కొన్ని పోస్టుల ఏ ర్పాటు, నూతనంగా ఏర్పడిన వివిధ పోస్టులు, మోడల్ ప్రైమరీ హెచ్‌ఎం పోస్టులు, ఆ హెచ్‌ఎం పరిధిలో పనిచేస్తున్న టీచర్లకు ఇలా.. వివిధ టెక్నికల్ సమస్యలతో మరో 3వేల మంది వరకు ఉపాధ్యాయుల జీతాలు విడుదల కాలేదు.
గాలికొదిలేసిన మంత్రి
సాధారణంగా జూన్, జూలై నెలల్లో ప్రతి కుటుంబంలో ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. వి ద్యా సంవత్సరం ప్రారంభంలో పిల్లల స్కూల్ ఫీజు లు, విద్యాసామగ్రి కోసం వేలల్లో వెచ్చించాల్సి ఉంటుంది. అలాగే బదిలీ జరిగిన ప్రాంతానికి వెళ్లేందు కు రవాణా ఖర్చులు, కొత్త ఇంటి అడ్వాన్సులు, ఇంటి అద్దెలు రూపంలో మరింత ఖర్చు పెరుగుతుంది. ఇంట్లో వ్యవసాయం ఉంటే విత్తనాలు, ఎరువు లు, దుక్కులకు చాలా ఖర్చులు చేయాల్సి ఉంటుంది. వీటిన్నింటికితోడు జీతాలు రాక పోవడంతో మంత్లీ ఈఎంఐల చెక్కు బౌన్సులు, పర్సనల్ లోన్, హౌసింగ్ లోన్ వంటి చెక్ బౌన్సులు అవుతున్నాయని వాపోతున్నారు. ప్రభుత్వ బదిలీల కారణంగా ఉపాధ్యాయుల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. చొరవ తీసుకుని అధికారులను అప్ర మత్తం చేసి న్యాయం చేయాల్సిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కనీస జాడ కనిపించడం లేదని వారు వాపోతున్నారు. తమశాఖకు చెందిన అధికారులే తమని పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పొజిషన్ ఐడీలు ఎక్కడ..?
సాధారణంగా ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు వా రు బదిలీ అయిన ప్రాంతాల్లో జీతాలు తీసుకునేలా అక్కడి డీడీఓకు సమాచారం అందిస్తారు. ఇందు కోసం ఉద్యోగులకు పొజిషన్ ఐడీలు కేటాయించాలి. ఈ తతంగాన్ని ప్రభుత్వమే దగ్గరుండి పూర్తిచేయాలి. గత నెల 15వ తేదీవ లోపల అన్ని క్యాడర్ల ఉపాధ్యాయుల బదిలీలను ప్రభుత్వం పూర్తి చేసింది. ఇది జరిగి నెలరోజులు దాటిపోయింది. ఇప్పటికీ ఉపాధ్యాయులకు పొజిషన్ ఐడీలు కేటాయించలేదు. దీంతో జూన్ నెలకు సంబంధించి జూలైలో రావాల్సిన జీతాలు ఉపాధ్యాయులకు ఇప్పటి వర కు అందలేదు. అలాగే జూలై నెలకు సంబంధించిన జీతాలు ఆగస్ట్ మొదటివారంలో అందుకునే అవకా శం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో లేనట్టేనని గగ్గోలు పెడుతున్నారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు రా ష్ట్రస్థాయిలో.. పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ అధికారులకు ఎన్ని విజ్ఞప్తులు చేసినా అతీగతీ లేదని సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
టీచర్లకు పొజిషన్ ఐడీలు కేటాయించడంలో ప్రభుత్వ అలసత్వం
జూన్ నెల జీతం రాలేదు, జూలై జీతం కూడా కష్టమేనని దిగులు
పట్టించుకోని ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు

బదిలీలు సరే.. జీతాలు వెయ్యరే..?

బదిలీలు సరే.. జీతాలు వెయ్యరే..?

బదిలీలు సరే.. జీతాలు వెయ్యరే..?