
రోడ్డుకు శంకుస్థాపన.. ట్రైసైకిళ్ల పంపిణీ
టెక్కలి: టెక్కలి మేజర్ పంచాయతీ పరిధి ఆంజనేయపురం గ్రామ రహదా రి దుస్థితిపై ఈ నెల 11న ‘సాక్షి’లో నరకానికి నకలు అనే వార్త ప్రచురితమైంది. అలాగే దివ్యాంగుల కోసం తీసుకువచ్చిన ట్రైసైకిళ్లు నెలల తరబడి టెక్కలి ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో పడి ఉండడంపై ఈ నెల 14న ‘ఎందుకింత నిర్లక్ష్యం..?’ అనే వార్త వచ్చింది. ఈ వార్తలకు మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. ఆయన ఆదివారం ఆంజనేయపురం గ్రామం రహదారి పనులకు శంకు స్థాపన చేశారు. అలాగే టెక్కలి ఎంపీడీఓ కార్యాలయంలో దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. అంతే కాకుండా ‘సాక్షి’లో వెలువడిన కథనాలను ప్రస్తావించారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి, ఎంపీడీఓ కె.ఫణీంద్రకుమార్ తో పాటు నాయకులు పాల్గొన్నారు.

రోడ్డుకు శంకుస్థాపన.. ట్రైసైకిళ్ల పంపిణీ