బిగుస్తున్న ఉచ్చు | - | Sakshi
Sakshi News home page

బిగుస్తున్న ఉచ్చు

Oct 1 2024 12:58 AM | Updated on Oct 1 2024 12:58 AM

బిగుస

బిగుస్తున్న ఉచ్చు

అరసవల్లి: జిల్లా వైద్యశాఖలో అక్ర మాలకు పాల్పడుతున్న అధికార సిబ్బందిని వెనుకేసుకుని వస్తున్న కీలక అధికారి తీరుపై ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనం వైద్య శాఖను ఓ కుదుపు కుదిపేసింది. ఉద్యోగమిప్పిస్తామంటూ మోసం చేసిన ఘటనలో బాధితుల పక్షాన కాకుండా అక్రమార్కులపై కరు ణ చూపుతున్న అధికారుల పాత్రలపై జిల్లా వ్యా ప్తంగా తీవ్రంగా చర్చనీయాంశమైంది. సోమ వారం బాధితులు నేరుగా కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ను కలిసి గోడు వెల్లడించారు. తమకు అన్యా యం జరిగిందని, శాఖాపరంగా ఈనెల 23న జరిగిన విచారణలో బాధితురాలు ఇచ్చిన వాంగ్మూల నివేదికను మార్చేశారన్న అనుమానాలున్నాయని చెప్పడంతో కలెక్టర్‌ దీన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారు. వెంటనే దీనిపై డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ బి.మీనాక్షిని వివరణ కోరినట్లుగా తెలుస్తోంది. దీంతో వైద్యశాఖ కీలక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

అటు కలెక్టర్‌..ఇటు ఎస్పీ

ఉద్యోగం కోసం మోసపోయిన బాధితురాలు ఆ త్మహత్యాయత్నానికి సైతం పాల్పడటం జిల్లాలో సంచలనమైన సంగతి విదితమే. ఈ మేరకు గత సోమవారం ఎస్పీ మహేశ్వరరెడ్డిని కలిసి బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ మోసం చేసిన వ్యక్తుల వివరా లను, సాక్ష్యాలకు కూడా చూపిస్తూ విన్నవించుకున్నారు. అలాగే ఈ సోమవారం నేరుగా జిల్లా కలెక్టర్‌ను కలిసి వివరించారు. ఈ రెండు పరిణామాలతో జిల్లా వైద్య శాఖపై కలెక్టర్‌, ఎస్పీలు దృష్టి సారించారు. ఇప్పటికే వైద్యశాఖలో అనుమానిత అధికారుల పనితీరును ఇంటెలిజెన్స్‌తో పాటు అవినీతి నిరోధక శాఖాధికారులు కూడా ఆరా తీస్తున్నారు. కీలక ఆధారాల సేకరణలో నిమగ్నమయ్యారు. మరోవైపు తన పేరునే వాడుకుని అక్రమాలకు తెరతీసిన వైనంపై కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ కూడా మండిపడుతున్నారు. దీంతో జిల్లా వైద్య శాఖలో మరో రెండు మూడు రోజుల్లో తీవ్ర పరిణామాలు వెలుగులోకి రానున్నాయని తెలుస్తోంది.

అవసరమైతే

సీఎం దృష్టికి..

వైద్యశాఖలో నివేదిక మార్పుపై కలెక్టర్‌ ఆగ్రహం

గత కొద్ది రోజులుగా బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు తమకు న్యాయం జరగాలంటూ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. నివేదిక మార్చేశారన్న అనుమానాల నేపథ్యంలో అవసరమైతే సీఎం దృష్టికి విషయాన్ని తీసుకెళ్తామని చెప్పారు.

బిగుస్తున్న ఉచ్చు1
1/1

బిగుస్తున్న ఉచ్చు

Advertisement
 
Advertisement
Advertisement