ఆటో డ్రైవర్‌ తప్పుగా ప్రవర్తిస్తున్నాడని.. | Sakshi
Sakshi News home page

ఆటో డ్రైవర్‌ తప్పుగా ప్రవర్తిస్తున్నాడని..

Published Wed, Apr 17 2024 1:20 AM

- - Sakshi

ఆటో నుంచి దూకిన యువతి

 తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలు

టెక్కలి రూరల్‌: ఒక ఆటో డ్రైవర్‌ తన శరీరంపై చేతులు వేసి అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఓ యువతి వెళ్తున్న ఆటో నుంచి దూకేసిన సంఘటన కోటబొమ్మాళి మండలం చిన్నసాన వద్ద చోటుచేసుకుంది. స్థానికులు, బాధితురాలి తల్లి తెలిపిన వివరాలు ప్రకారం.. కోటబొమ్మాళి మండలం చిన్నసాన గ్రామానికి చెందిన ఓ మహిళ తన కుమార్తెతో కలిసి టెక్కలి వచ్చారు. అక్కడ టీవీతో మరికొంత సామగ్రిని కొనుగోలు చేశారు.

వాటిని తీసుకెళ్లేందుకు ఆ షాపు యజమాని టెక్కలి కి చెందిన ఆటోకు చెప్పడంతో ఆ ఆటోలో సామగ్రి లోడ్‌ చేసుకుని తన కూతురితో కలసి ఇంటికి వెళ్లారు. సామగ్రి కిందకు దించుతుండగా కొన్ని సామాన్లు కనిపించకపోవడంతో కుమార్తె వెతుక్కుంటూ ఆ దారిన వెళ్లింది. అదే దారిలో కలిసిన ఆటో డ్రైవర్‌ ఆమెను బండిలో కూర్చోవాలని కోరాడు. కొంత దూరం వెళ్లాక అతను తేడాగా వ్యవహరించడంతో ఆ యువతి ఆటో నుంచి దూకేసింది. అది చూసి ఆటో డ్రైవర్‌ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆ యువతిని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement
 
Advertisement