
నెల్లిపర్తిలో పొదుపు సంఘాల సభ్యుల సమావేశం (ఫైల్)
పొదుపు సంఘాలే..
సరుబుజ్జిలి: స్వయం సహాయక సంఘాల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఈ కోవలోనే పొదుపు –రుణాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. సభ్యులు ప్రతి నెలా పొదుపు చేసుకునే సొమ్ము నుంచి అంతర్గత రుణం రూపంలో అవసరాలకు వాడుకునేలా అవకాశం కల్పించారు. దీనితో వచ్చే వడ్డీ తిరిగి సంఘానికే జమ చేసి వారి అభ్యున్నతికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు బ్యాంకర్లతో మాట్లాడి నిబంధనలు సరిచేసేలా చొరవ తీసుకున్నారు.
ఇదీ పరిస్థితి..
మహిళలు కనీసం పది మంది సమైక్య సంఘంగా ఏర్పడి కొంతమేర పొదుపు చేసుకొని, బ్యాంకుల నుంచి రుణం తీసుకొని అవసరాలకు వినియోగించుకునేవారు. అయితే పొదుపు సొమ్ము వినియోగానికి అంతగా అవకాశం ఉండేది కాదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచన మేరకు పొదుపు సంఘాలు ఆర్థికంగా మరింత బలోపేతమయ్యేలా బ్యాంకర్ల నిబంధనలు సరిచేశారు. దీని ప్రకారం మహిళా సంఘాలు తమ పొదుపు ఖాతాలో ఉన్న సొమ్మును మినీ బ్యాంకు తరహాలో అంతర్గత రుణాలు ఇచ్చే దిశగా బ్యాంకులు ముందుకు సాగుతున్నాయి. జిల్లాలో 1294 గ్రామ సంఘాల్లో 49,030 మంది మహిళా సంఘ సభ్యులు ఉన్నారు. రూ.668.82 కోట్ల పొదుపు సొమ్ము ఉంది. ఇందులో నుంచి ఆగస్టు నుంచి 2023 అక్టోబర్ 30 వరకు 17,888 మంది సంఘ సభ్యులు రూ.27.65 కోట్లు అంతర్గత అప్పులుగా పొందారు.
ఉమ్మడి నిధిలో జమ..
పొదుపు సంఘాలు ఆర్థికంగా మరింత బలపడట మే మినీ బ్యాంకుల ఉద్దేశం. గతంలో ఒక సంఘం నుంచి నలుగురు సభ్యులు నాలుగు లక్షల రూపాయలు బ్యాంకు రుణంగా తీసుకుంటే దానిపై వచ్చే వడ్డీ ఇప్పటివరకు బ్యాంకు సేవింగ్ ఖాతాకే పరిమితం చేసేవారు. ప్రస్తుతం సభ్యులు తమ సంఘంలోని సొమ్మును ఎవరికై నా రూపాయి వడ్డీకి అప్పు గా ఇస్తే వడ్డీ తిరిగి వచ్చే సమయంలో ఆ డబ్బులు సంఘ ఉమ్మడి నిధిలో జమచేస్తారు. వడ్డీ సొమ్ము సభ్యులందరి ఖాతాకు జమ కావడం వల్ల అప్పు తీసుకున్న సభ్యురాలికి కూడా కొంత ఉపశఽమనం కలుగుతుంది. ఈ విధంగా జిల్లాలో ఇప్పటికే 17,888 మంది ఒక్కొక్కరూ రెండు నుంచి మూడు లక్షల రూపాయలు చొప్పున రుణాలు పొందారు.
నూతన విధానం
బాగుంది
ప్రభుత్వం మహిళా సంఘాల బలోపేతం కోసం తీసుకొచ్చిన నూతన విధానం వల్ల సంఘాలకు చాలా ప్రయోజనం. గతంలో పొదుపు చేసిన సొమ్ము బ్యాంకులో ఉంటే పావలావడ్డీ వచ్చేది. ప్రస్తుతం పొదుపు సొమ్ముల నుంచి మా సభ్యులకే మినీ బ్యాంకుల తరహాలో రుణాలు ఇవ్వడం వల్ల రూపాయి వడ్డీ గిట్టుబాటు అవుతోంది. దీంతో సంఘాలు ఆర్థికంగా వృద్ధి చెందుతున్నాయి.
– ఎడ్ల సులోచన, స్వయం సహాయక సంఘ
సభ్యురాలు, సవలాపురం జంక్షన్
ఆర్థికంగా ప్రయోజనం..
పొదుపు నిధిలో 90 శాతం వరకు సొమ్మును సంఘ సభ్యులకు గానీ, ఇతరులకు గానీ అప్పుల రూపంలో ఇవ్వవచ్చు. దీనిపై ఎటువంటి ఆంక్షలు విధించరాదని ఇప్పటికే ప్రభుత్వం బ్యాంకర్లకు సూచించింది. పొదుపు చేసిన నగదును అప్పుగా ఇస్తే వచ్చిన వడ్డీ సంఘం నిధికి జమవుతుంది. దీనివల్ల సభ్యులకు ఆర్థికంగా ప్రయోజనం ఉంటుంది. – పి.కూర్మారావు,
అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్, వెలుగు
అంతర్గత అప్పు(పొదుపు) తీసుకున్న సంఘ సభ్యులు
17,888
వాడిన రుణాల
మొత్తం
రూ.27.65 కోట్లు
అంతర్గత వ్యవస్థత బలోపేతం..
గతంలో పొదపు సంఘాల సభ్యులు నెలవారీగా దాచుకున్న పొదుపు సొమ్ములో బ్యాంకు సేవింగ్ ఖాతాలో నిరుపయోగంగా పడి ఉండేవి. దీంతో పావలా వడ్డీ కూడా సభ్యులకు దక్కేదికాదు. దీంతో ప్రభుత్వం చొరవచూపి బ్యాంకుల్లో నిల్వ ఉన్న పొదుపు సంఘాల నిధులు సంఘ సభ్యుల ద్వారా ఇతరులకు గానీ, సభ్యులకు గానీ అప్పులు ఇచ్చి దాని వడ్డీ సంఘ నిధికి జమ అయ్యేలా నూతన విధానం తీసుకొచ్చారు. ఓ వైపు సంఘాలు బ్యాంకుల నుంచి ఇచ్చిన రుణాలు సద్వినియోగం చేసు కుంటూ, మరోవైపు తాము సొంతంగా రుణాలు అందించి అంతర్గత వ్యవస్థను బలోపేతం చేసుకొంటున్నాయి. ఈ రుణాలు నెలవారీ గానీ, ఒకే విడతగా గానీ చెల్లించేందుకు సంఘాలు అవకాశం కల్పిస్తున్నాయి. దీని ద్వారా బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా తామే బ్యాంకర్లుగా మారి ఆర్థికంగా బలపడుతున్నారు.
తాము పొదుపు చేసిన సొమ్ము రుణాలు ఇచ్చే వెసులుబాటు
వాటిపై వడ్డీ ఆదాయం సంఘం ఉమ్మడి ఖాతాకు జమ
ఫలితంగా డ్వాక్రా
మహిళలకు అదనపు ఆదాయం
జిల్లాలో స్వయం సహాయక సంఘాలు 1,294

సంఘ సభ్యులు 49,030మంది

