
జీపు జాతాకు స్వాగతం పలుకుతున్న ఏపీ మహిళా సంఘం ప్రతినిధులు
నరసన్నపేట: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రం అమ్మకుండా మనమే కాపాడుకోవాలని సీపీఎం రాష్ట్ర నాయకులు కొత్తపల్లి లోకనాథం అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై –ఉక్కు రక్షణ యాత్ర పేరిట చేపట్టిన జీపు జాతా శుక్రవారం నరసన్నపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక సీఐటీయూ ప్రతినిధులు, ఏపీ మహిళా సంఘం ప్రతినిధులు జీపు జాతా ప్రతినిధులకు స్వాగతం పలికారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొత్తపల్లి లోకనాథం మాట్లాడుతూ ప్రత్యేక హోదాతో పాటు అనేక విభజన హామీలను తుంగలోకి తొక్కి కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను ఉద్యమాల ద్వారానే కాపాడుకోగలమని తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ ప్రతినిధి ఆర్.సురేష్‌బాబు, కాల నరసింహులు, మహిళా సంఘం ప్రతినిధులు ఆర్.స్వప్న, రైతు సంఘం నాయకులు కె.కొండయ్య,కేవీపీఎస్ జిల్లా ప్రదాన కార్యదర్శి జోగి గన్నయ్య లతో పాటు పలువురు పాల్గొన్నారు.