
25న రాష్ట్రస్థాయి ఓపెన్ చెస్ పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని రాజాంలో ఈనెల 25వ తేదీన జరిగే ఏపీ రాష్ట్రస్థాయి ఓపెన్ చెస్ పోటీలను విజయంతం చేయాలని ఆలిండియా చెస్ ఇన్ స్కూల్ ట్రైనర్ సనపల భీమారావు కోరారు. రాజాంలోని జీఎంఆర్ ఐటీ కాలేజ్ వేదికగా పోటీలు జరుగుతాయన్నారు. కళాశాల ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ జె.గిరీష్, ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్‌వీఆర్‌ఎస్‌వీ ప్రసాద్, మీట్ కార్యనిర్వహణ కార్యదర్శి డాక్టర్ బి.అరుణ్‌కుమార్ పోటీలకు సంబంధించి దగ్గరుండి ఏర్పాట్లను కల్పిస్తున్నట్టు తెలిపారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు రూ. 1,30,000 నగదు బహుమతులతో పాటు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలను అందజేయనున్నట్టు చెప్పారు. వివరాలకు 99125 59735 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
సదరం.. అవస్థలు పదిలం
నరసన్నపేట: దివ్యాంగ పింఛన్ల ఏరివేతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. అందులో భాగంగా స్థానిక ఏరియా ఆస్పత్రిలో సదరం పరిశీలన కొనసాగుతోంది. నాలుగు నెలల క్రితం సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభించారు. ఇప్పటి వరకు నరసన్నపేట, పోలాకి, జలుమూరు, ఆమదాలవలస మండలాలకు చెందిన దివ్యాంగుల సర్టిఫికెట్లు పరిశీలించారు. శుక్రవారం నుంచి సారవకోట మండలానికి చెందిన దివ్యాంగుల పత్రాల పరిశీలన ప్రారంభమైంది. సుదూరమైనా నరసన్నపేట ఆస్పత్రికే వెళ్లాలని చెబుతుండడంతో దివ్యాంగులు అవస్థలు పడుతున్నారు. పరిశీలన కేంద్రం వద్ద కనీస సౌకర్యాలు ఉండటం లేదని వాపోతున్నారు. ఒక్కో రోజు సర్వర్ డౌన్ అవుతుండటంతో మళ్లీ మరుసటి రోజు రావాల్సి వస్తుందని అంటున్నారు. సిబ్బందికి కూడా భోజన సదుపాయాలు సైతం కల్పించడం లేదు.

25న రాష్ట్రస్థాయి ఓపెన్ చెస్ పోటీలు