
విద్యుదాఘాతంతో ఆవు మృతి
ఎచ్చెర్ల: లావేరు మండలంలోని తాళ్లవలస పంచాయతీ బొడ్డపాడు గ్రామంలో కాలారి నారాయణరావుకు చెందిన సుమారు రూ. 80 వేలు విలువ చేసే చూడి ఆవు శుక్రవారం విద్యుదాఘాతంతో మృతి చెందింది. వ్యవసాయ మోటారుకు వెళ్లే విద్యుత్ లైన్ ట్రాన్సఫార్మర్ గ్రామం మధ్యలో కిందకు ఉండడం వల్ల ఆవుకు విద్యుత్ షాక్ కొట్టిందని గ్రామస్తులు చెబుతున్నారు.
ఫుడ్ పాయిజన్‌తో రెండు గేదెలు మృతి
కంచిలి: మండలంలోని మండపల్లి గ్రామానికి చెందిన బెందాళం గణపతి అనే రైతుకు చెందిన రెండు ముర్రా జాతి గేదెలు శుక్రవారం ఉదయం హఠాత్తుగా మృతిచెందాయి. ఎప్పటిలాగే ఉదయం ఆహారంగా పాలిష్ తౌడు కలిపి పెట్టారు. ఆహారాన్ని తింటూ అనారోగ్యానికి గురయ్యాయి. దీంతో అప్పటికప్పుడే మృతిచెందినట్లు రైతు గణపతి వాపోయాడు. రోజుకు 5 లీటర్లు చొప్పున పాలు ఇచ్చేవని రైతు తెలిపాడు.

విద్యుదాఘాతంతో ఆవు మృతి