
ఈ–క్రాప్ కొత్త విధానంలో క్షేత్రస్థాయికి వెళ్లి నమోదు ప్రక్రియను చేపడుతున్నాం. రైతు ఫొటో తీసి, పంట నమోదును చేపట్టడం జరుగుతోంది. దీని వల్ల పంటల సమాచారం పూర్తిస్థాయిలో నమోదవుతుంది. ఈ విధానంలో ఒక రైతుకు సంబంధించిన రైతు వివరాలు నమోదు చేయడానికి వెళ్లేటప్పుడు సంబంధిత లొకేషన్‌కు వెళ్లేటప్పుడు, వివరాలు కొన్నిసార్లు యాప్‌లో ఓపెన్ కావడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులకు తెలియజేశాం.
– విద్యాసాగర్, వ్యవసాయ సహాయ సంచాలకుడు, కొల్లూరు, కంచిలి మండలం