ఉద్దాన జానపద నృత్యానికి గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

ఉద్దాన జానపద నృత్యానికి గుర్తింపు

Sep 22 2023 1:50 AM | Updated on Sep 22 2023 1:50 AM

ప్రశంసా పత్రం పొందుతున్న
ఉద్దాన కళాకారుడు పత్రి తాతారావు  - Sakshi

ప్రశంసా పత్రం పొందుతున్న ఉద్దాన కళాకారుడు పత్రి తాతారావు

కాశీబుగ్గ: అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకల్లో భాగంగా ఆర్కే ఫౌండేషన్‌ నిర్వహించిన వేడుకల్లో శ్రీకాకుళం జిల్లా ఉద్దాన జానపద నృత్యానికి గుర్తింపు లభించింది. పల్లె, జానపద, పంటపొలాల, గైరమ్మ పాటలకు ఆ పాటలకు చేసే నృత్యానికి గాను కొంతమంది కళాకారులను గుర్తించారు. ఈ సందర్బంగా ప్రముఖ తమిళ కన్నడ సినీనటి ఖుషిపురి చేతుల మీదుగా ఉత్తమ జానపద నృత్య కళాకరునిగా పలాస మండలం బొడ్డపాడు గ్రామానికి చెందిన పత్రి తాతారావు అనే కళాకారుడికి ప్రశంసా పత్రం అందించారు. ఈ సందర్భంగా ఉద్దాన ప్రాంతంలో పాటు, జిల్లా కళాకారులు అభినందనలు తెలుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement