
మొదట జరిగిన వివాహం బయటకు చెప్పకుండా స్వగ్రామంలో మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ మేరకు జూన్ 2022న యువతితో నిశ్చితార్ధం చేసుకున్నాడు.
వజ్రపుకొత్తూరు రూరల్: పెళ్లి పేరుతో యువతిని మోసగించిన కేసులో ఉపాధ్యాయుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు కాశీబుగ్గ రూరల్ సీఐ జి.శంకరరావు తెలిపారు. వజ్రపుకొత్తూరు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు వరశెట్టి రాజేష్ ఇచ్ఛాపురం ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. సహ ఉపాధ్యాయురాలిని 2021 నవంబర్‌లో ఇంట్లో తెలియకుండా రహస్యంగా వివాహం చేసుకున్నాడు.
అయితే మొదట జరిగిన వివాహం బయటకు చెప్పకుండా స్వగ్రామంలో మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ మేరకు జూన్ 2022న యువతితో నిశ్చితార్ధం చేసుకున్నాడు. కాబోయే భార్యభర్తలం అంటూ నమ్మబలికి శారీరకంగా లోబర్చుకున్నాడు. యువతి కుటుంబ సభ్యులు పెళ్లి చేసుకోమని అడిగినప్పుడల్లా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ వచ్చాడు.
ఈ విషయాన్ని యువతి తల్లిదండ్రులు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టినా పెళ్లికి అంగీకరించకపోవడంతో బాధిత యువతి బుధవారం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేసి పలాస కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు. ఆయనతో పాటు ఎస్సై వై.మధుసూదన్‌రావు ఉన్నారు.