
డి.పి.దేవ్‌ను సన్మానిస్తున్న సంఘ నాయకులు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): శ్రీశయన కార్పొరేషన్ చైర్మన్‌గా డి.పి.దేవ్‌ను నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ సందర్భంగా దేవ్ మాట్లాడుతూ తన నియామకం పట్ల సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి ధర్మాన ప్రసాదరావు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి తమ కులానికి మంచి సేవలు అందిస్తానని చెప్పారు. కార్పొరేషన్ చైర్మన్‌గా నియామకం పట్ల శ్రీయన సంక్షేమ సంఘం నాయకులు బుధవారం ఆయ న నివాసంలో కేక్ కట్ చేసి సన్మానించారు. కార్యక్రమంలో సంఘ నాయకులు గుజ్జల శాంతీశ్వరరావు, బి.పండరీనాథ్, కోట రామారావు, జాక శ్యామ్‌సుందర్, జోగి అప్పలస్వామి, కర్రి రంగాజీదేవ్, చింతనిప్పుల రాజేంద్ర పాల్గొన్నారు.