
పార్టీలో చేరిన వారికి కండువాలు వేసి సాదరంగా ఆహ్వానిస్తున్న కృష్ణదాస్
నరసన్నపేట: రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళా సాధికారిత పెరిగిందని, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలయ్యాయని నరసన్నపేట ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఈ స్ఫూర్తితోనే పార్లమెంట్‌లో 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెప్పారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బిల్లుకు వైఎస్సార్ సీపీ ఎంపీలు మద్దతు పలకడం పట్ల రాష్ట్రంలోని ఆడపడుచులంతా గర్విస్తున్నారని పేర్కొన్నారు. మండలాల్లో మహిళా జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయడం ద్వారా బాలికల్లో డ్రాపౌట్స్ తగ్గుతున్నారన్నారు.
వైఎస్సార్ సీపీలో 20 కుటుంబాల చేరిక..
జలుమూరు: సీఎం జగన్‌మోహన్ రెడ్డి పేదలకు అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధికి ఆకర్షితులమై వైఎస్సార్ సీపీలో చేరినట్లు కూర్మనాథపురం టీడీపీ నాయకులు స్పష్టం చేశారు. ఈ మేరకు మబగాంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, నరసన్నపేట ఎమ్యేల్యే ధర్మాన కృష్ణదాస్ సమక్షంలో మాజీ నీటి సంఘం అధ్యక్షుడు రెడ్డి అప్పారావు తోపాటు 20 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. కృష్ణదాస్ వీరిని సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో బెండు సాయన్న, రెడ్డి సత్యనారాయణ, బండి రాము, కె.కృష్ణ, వాన శిమ్మన్న తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వాన గోపి, వైస్ ఎంపీపీ తంగి మురళీకృష్ణ, పార్టీ అధ్యక్షుడు కనుసు సీతారాం, సచివాలయ కన్వీనర్ ధర్మాన జగన్, మొయ్మి మన్మధరావు, పిల్లల దాసుబాబు, శిమ్మ నాగేశ్వరరావు, కొర్ను రాజు, నవిరి పోతయ్య తదితరులు పాల్గొన్నారు.