
సంతబొమ్మాళి: మండలంలోని మర్రిపాడు పంచాయతీలో ఉపాధి పనులకు సంబంధించిన రికార్డులను డ్వామా పీడీ మురళీకృష్ణ పరిశీలించారు. ‘ఇదేం పని’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. గ్రామ సచివాలయానికి వెళ్లి వివరాలు నమోదు చేశారు. వేతనదారులు వేరే పనులకు వెళ్లిపోవడంతో వారి నుంచి వివరాలను సేకరించలేదని, మరో రోజు వచ్చి వేతనదారులు స్టేట్‌మెంట్ నమోదు చేస్తామని ఏపీడీ తెలిపారు.
4న జిల్లా జూనియర్స్ బాక్సింగ్ ఎంపికలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా జూనియర్స్ బాలబాలికల బాక్సింగ్ ఎంపిక పోటీలు ఈ నెల 4న జరగనున్నాయని జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి బి.ఎ.లక్ష్మణ్‌దేవ్ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం ప్రాంగణంలో ఆదివారం ఉదయం 7 గంటలకు ఎంపికలు మొదలవుతాయని పేర్కొన్నారు. 44 నుంచి 80 కేజీల విభాగాల మధ్య ఎంపిక పోటీలు జరుగుతాయని చెప్పారు. 2007 జనవరి 1 నుంచి 2008 డిసెంబర్ 31 మధ్య జన్మించిన వారు అర్హులని స్పష్టంచేశారు. ఎంపికై న క్రీడాకారులను ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఈ నెల 9 నుంచి 11 వరకు జరిగే ఏపీ రాష్ట్ర జూనియర్స్ బాక్సింగ్ చాంపియన్‌షిప్–2023 పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 89774 96979 నంబర్‌ను సంప్రదించాలన్నారు.