ఆదాయ వనరులను పెంపొందించుకోండి | - | Sakshi
Sakshi News home page

ఆదాయ వనరులను పెంపొందించుకోండి

Sep 18 2026 12:15 AM | Updated on Sep 18 2026 12:15 AM

పుట్టపర్తి అర్బన్‌: గ్రామీణ మహిళలు డ్వాక్రా రుణాలను తీసుకొని ఆదాయ వనరులను పెంపొందించుకోవాలని డీఆర్‌డీఏ పీడీ నరసయ్య పేర్కొన్నారు. గురువారం స్థానిక వెలుగు కార్యాలయంలో ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి కర్నూలు జిల్లాలకు చెందిన ఐఎఫ్‌సీ సీఆర్పీలకు మూడు రోజుల శిక్షణలో భాగంగా మొదటి రోజు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. పీడీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థికాభివృద్ధి, జీవనోపాదుల మెరుగుదల, వ్యాపారాభివృద్ధికి , ఆర్థిక స్వావలంబనకు ఐఎఫ్‌సీలు (ఇంటరనల్‌ ఫైనాన్సియల్‌ కన్సల్టెంట్స్‌) పాత్ర కీలకమన్నారు. ఐఎఫ్‌సీ క్లస్టర్‌ వ్యూహం ద్వారా సభ్యులకు మెరుగైన ఆర్థిక సేవలు, వ్యాపారావకాశాలు అందేలా కృషి చేస్తాయన్నారు. కార్యక్రమంలో డీపీఎం రామమోహన్‌, వాసన్‌ ఎన్‌జీఓ ఊతప్ప, ఏపీఎంలు రమణప్ప, ఓబులేషు, నాలుగు జిల్లాల ఐఎఫ్‌సీ సీఆర్పీలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement