రొళ్ల: రెండేళ్లుగా బీసీ కాలనీలో నెలకొన్న తీవ్రమైన తాగునీటి సమస్యను పరిష్కరించడంలో నియోజకవర్గస్థాయి ముఖ్య నాయకులు, ప్రత్యేక అధికారులు పూర్తిగా విఫలం అయ్యారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మండలంలోని హెచ్‌టీ హళ్లిలో మహిళలు ప్రధాన రోడ్డు పై ఆందోళన చేపట్టారు. బీసీ కాలనీలో 75 కుటుంబాలకు పైగా నివాసం ఉంటున్నా తాగునీటికి నానా అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొందన్నారు. రోడ్డుపై ముళ్ల కంప వేసి వాహన రాకపోకలను అడ్డుకొని నిరసన తెలిపారు. స్పందించిన అధికారులు నాలుగు రోజుల్లో నీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.


