● ఎస్పీ సతీష్‌కుమార్
పుట్టపర్తి టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను గడువులోపు పరిష్కరించాలని ఎస్పీ సతీష్ కుమార్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం పోలీస్ కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఎస్పీ సతీష్‌కుమార్ 70 వినతులు స్వీకరించి బాధితులతో ముఖాముఖి మాట్లాడారు. చట్టపరిధిలో విచారించి పరిష్కారం చూపుతామని తెలిపారు. అర్జీలు పునరావృతమైతే చర్యలు తప్పవని పోలీస్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానా, లీగల్ అడ్వైజర్ సాయినాథ్‌రెడ్డి, సీఐ బొజ్జప్ప, లక్ష్మీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేడు ఎస్కేయూ
ఆవిర్భావ దినోత్సవం
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం 45వ ఆవిర్భావ దినోత్సవం మంగళవారం నిర్వహించనున్నారు. భువన విజయం ఆడిటోరియంలో జరిగే కార్యక్రమానికి ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ ఎన్‌వీఆర్ జ్యోతి కుమార్ ముఖ్య అతిథిగా, శలాక రఘునాథ శర్మ విశిష్ట అతిథిగా హాజరు కానున్నారు.
● విజయనగర రాజుల్లో గొప్పవాడైన శ్రీకృష్ణదేవరాయలు పేరున 1981 జులై 27న విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఎస్వీయూ అనుబంధంగా 1968లో పీజీ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. 1976లో స్వయంప్రతిపత్తి హోదా లభించింది. 1981లో పూర్తిస్థాయి వర్సిటీగా రూపాంతరం చెందింది. ఎస్కేయూలో చదివిన పలువురు వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగారు. ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణా రావు, మాజీ డీజీపీ జేవీ రాముడు ఎస్కేయూలో పీజీ చదివారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ డీజీపీ బయ్యారపు ప్రసాద్ రావు ఫిజిక్స్ విభాగంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. మాజీ డీజీపీ అరవింద రావు ఇంగ్లిష్ విభాగంలో పీజీ చదివారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస రెడ్డి ఎస్కేయూలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. ఇలా ఎంతో మంది పూర్వ విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారు.


