పుట్టపర్తి అర్బన్: వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురికి పార్టీ అనుబంధ కమిటీల్లో చోటు కల్పిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా పుట్టపర్తికి చెందిన ఎం. శ్రీనివాస నాయక్, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా మడకశిరకు చెందిన ఈ.జయరాం, ఫణి యాదవ్‌లను నియమించారు.
జిల్లా సోషల్ మీడియా కమిటీలో...
వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా జిల్లా ఉపాధ్యక్షుడిగా ధర్మవరానికి చెందిన దేవరపల్లి అశోక్‌కుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా రాచం శ్రీధర్‌రెడ్డి, కార్యదర్శిగా కుణుతూరు దివాకర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా నగిరి రంజిత్ నాయుడు, కార్యనిర్వాహక సభ్యులుగా ముత్యాల నాగరాజు, దినేష్ కుమార్‌రెడ్డి, సీకే హరికృష్ణ, ఎం. లోకేష్ కుమార్‌ను నియమించారు.


