ఘనంగా వన భోజనాలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా వన భోజనాలు

Jul 17 2026 7:15 AM | Updated on Jul 17 2026 7:15 AM

రోజంతా ఊరు వదిలి గ్రామం బయటే పూజలు, భోజనాలు

చెట్టు దేవునికి విశేష పూజలు

విషవాయువు పీల్చి ఉద్యోగి మృతి

భూదాన్‌పోచంపల్లి: తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామ శివారులోని హెజిలో లేబోరేటరీస్‌లో గురువారం రియాక్టర్‌ను శుభ్రం చేస్తుండగా వెలువడిన రసాయన వాయువు పీల్చి కెమిస్ట్రీ మృతి చెందాడు. అనంతపురం జిల్లా శింగనమల మండలం ఉల్లికల్లుకు చెందిన పాలమూరు కృష్ణారెడ్డి (43) హెజిలో లేబోరేటరీస్‌లో కొంత కాలంగా కెమిస్ట్రీగా పనిచేస్తున్నాడు. గురువారం కొత్త మందుల బ్యాచ్‌ తయారీకిగాను రియాక్టర్‌ను శుద్ధి చేస్తుండగా అందులోంచి విడుదలైన విషవాయువు పీల్చడంతో స్పృహతప్పి కిందపడిపోయాడు. వెంటనే కృష్ణారెడ్డిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

రొళ్ల: మండల పరిధిలోని దొమ్మరహట్టిలో వన భోజనాల కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఇందులో భాగంగానే ఊరిని వదిలి .. గ్రామం వెలుపల వనభోజనాలు చేసుకున్నారు.వివరాలు.. గురువారం మండల పరిధిలోని దొమ్మరహట్టిలో నివాసం ఉన్న ఒకే సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఉదయాన్నే పిల్లా పాపలతో పాటు పెంచుకున్న జీవాలు, వంట సామగ్రితో సహా గ్రామం బయట తాత్కాలికంగా గుడిసెలు వేసుకున్నారు. ముందుగా ఊరి ప్రధాన రోడ్డుకు ముళ్ల కంచెను అడ్డుగా చేశారు. తర్వాత చెట్టు దేవునికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించి జీవాలను బలిచ్చారు. ఏడాది ఒకసారి ఆషాఢ మాసంలో గ్రామాన్ని బహిష్కరించి చెట్టు దేవునికి పూజలు చేసి వంటకాలు చేసిన తర్వాత నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని గ్రామస్తులు తెలిపారు. ఇలా చేయడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండటంతో పాటు ప్రజలు ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో ఉంటారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement