రమణీయం.. రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

రమణీయం.. రథోత్సవం

Jul 17 2026 7:15 AM | Updated on Jul 17 2026 7:15 AM

పుట్టపర్తి టౌన్‌: సాయి జగన్నాథుని నామస్మరణతో పుట్టపర్తి ప్రతిధ్వనించింది. గురువారం సత్యసాయి భక్తులు, స్థానిక ప్రజలు పట్టణంలో సాయి జగన్నాథ రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిని కీర్తి పాడిన సంకీర్తనలు, భజనలతో భక్తులు మైమరచిపోయారు. కీర్తనలు, భజనలు, డప్పు వాయిద్యాలు, కోలాటాలు, చిన్నారుల నాట్యం నడుమ హనుమాన్‌ కూడలిలో ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర ఆర్టీసీ బస్టాండ్‌, విద్యాగిరి ఆర్చ్‌, గోకులం గణేష్‌కూడలి వరకు సాగింది. అంతకుముందు రథోత్సవాన్ని సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌.జే రత్నాకర్‌ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం సాయిభక్తులతో కలసి రథాన్ని లాగారు. అనంతరం రత్నాకర్‌ మాట్లాడారు. పుట్టపర్తిలో జగన్నాథ రథోత్సవం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. సత్యసాయి బాబా బోధించిన ప్రేమ, సేవ, మానవతా విలువలను ప్రతికి ఒక్కరికీ అందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితోపాటు సాయిభక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అగళి: మండలంలోని అగళి, ఇరిగేపల్లి వద్ద సువర్ణముఖి నదిపై వంతెన కూలిపోయి దాదాపు రెండేళ్లు కావొస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అగళి నుంచి ఇరిగేపల్లి, నందరాజునపల్లి తదితర గ్రామలకు వైపునకు వెళ్లడానికి ఇదే ప్రధాన రహదారి కావడంతో భారీ సంఖ్యలో వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారు. గతంలో కురిసిన భారీ వర్షాలకు వంతెన కూలిపోయింది. దీంతో వంతెనపై వాహనాల రాకపోకలకు నిషేధించారు. వాహనాల రాకపోకలకు వీలుగా పక్కనే డైవర్షన్‌ రోడ్డును ఏర్పాటు చేశారు. అయితే వర్షాకాలంలో ఆ రోడ్డులో బురద ఎక్కువగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి వంతెన నిర్మించాలని వాహనదారులు కోరుతున్నారు.

27ఎండీకెఎస్‌203: ధ్వంసమైన ఇరిగేపల్లి వంతెన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement