ప్రశాంతి నిలయం: ‘మహిళా సాధికారతే లక్ష్యంగా సత్యసాయి పలు కార్యక్రమాలు చేపట్టారని అందులో భాగంగానే మహిళా విద్యను ప్రోత్సహిస్తూ అనంతపురంలో ప్రత్యేకంగా సత్యసాయి మహిళా క్యాంపస్‌ను ప్రారంభించారు. ఆయన మార్గంలోనే నేడు ట్రస్ట్ సైతం చక్కటి వసతులతో నూతన వసతి గృహ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది’ అని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ రాజు పేర్కొన్నారు. 1968లో అనంతపురంలో సత్యసాయి స్థాపించిన మహిళా క్యాంపస్‌లో మహిళా విద్యార్థినులకు చక్కటి వసతులు కల్పించడానికి నూతన వసతిగృహ నిర్మాణానికి ట్రస్ట్ శ్రీకారం చుట్టింది. గురువారం రత్నాకర్ రాజు నిర్మాణ పనులను ప్రారంభించారు. 1500 మంది విద్యార్థినులకు ఆధునిక సౌకర్యాలతో వసతి కల్పించేందుకు ఈ వసతి గృహాన్ని నిర్మిస్తున్నారు. క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన సత్యసాయి చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా రత్నాకర్ రాజు మాట్లాడుతూ ప్రపంచ నలుమూలలా సత్యసాయి సంస్థల ద్వారా అందుతున్న సేవా కార్యక్రమాల్లో మహిళా మణులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. కార్యక్రమంలో సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లర్నింగ్ వైస్ చాన్సిలర్ డాక్టర్ పీ రాఘవేంద్రప్రసాద్ , క్యాంపస్ సిబ్బంది, సత్యసాయి భక్తులు ధనేష్ గడియా, సంజయ్ గదియా తదితరులు పాల్గొన్నారు.
సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్


