కట్టడం పైనుంచి కిందపడి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

కట్టడం పైనుంచి కిందపడి వ్యక్తి మృతి

May 24 2026 1:15 AM | Updated on May 24 2026 1:15 AM

హిందూపురం: స్థానిక గుడ్డం ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న కట్టడం పైనుంచి కింద పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన మేరకు.. శనివారం సాయంత్రం భవనం పై అంతస్తులో ఎర్రకొట్టాలకు చెందిన ఎలక్ట్రీషియన్‌ బాబ్జాన్‌ (30) పని చేస్తూ ప్రమాదవశాత్తు అదుపు తప్పి కిందపడ్డాడు. ఆ సమయంలో అతనితో పాటు సవార్లపై నిలబడిన మరో కార్మికుడు జావీద్‌ఖాన్‌ కూడా కిందపడ్డాడు. తోటి కార్మికులు గమనించి ఇద్దరినీ వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బాబ్జాన్‌ మృతి చెందాడు. ఘటనపై వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement