చంద్రబాబుకు రైతుల ఉసురు తగులుతుంది | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు రైతుల ఉసురు తగులుతుంది

May 22 2026 12:48 AM | Updated on May 22 2026 12:48 AM

పరిగి: గిట్టుబాటు ధరలు లేక రైతులు సర్వనాశనమవుతున్నా.. ఏమాత్రమూ పట్టించుకోకుండా కేవలం స్వప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతుల ఉసురు తగులుతుందని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌ అన్నారు. గురువారం ఆమె పరిగి మండలంలోని బీచిగానిపల్లి పంచాయతీ వంగలపల్లిలో బాలకృష్ణారెడ్డి, యోగానందరెడ్డి మామిడి తోటలను పరిశీలించారు. సాగువ్యయం, గిట్టుబాటు ధర గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రైతుల సమస్యలను సీఎం చంద్రబాబు పూర్తిగా విస్మరించారన్నారు. కనీసం పెట్టుబడి సాయం చేయడం లేదని మండిపడ్డారు. పైగా ‘వరి వేయొద్దండి...యూరియాను వాడొద్దండి’ అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏటా మే నెలలోనే పెట్టుబడి సాయం అందిచేవారని గుర్తు చేశారు. అలాగే ప్రతి పంటకూ గిట్టుబాటు ధర కల్పించి రైతాంగాన్ని ఆదుకున్నారన్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవేమీ లేకపోవడంతో రైతాంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఖరీఫ్‌కు సిద్ధమవుతున్నా..విత్తన పంపిణీపై నేటికీ ప్రకటన చేయలేదన్నారు. రైతాంగాన్ని నాశనం చేసిన చంద్రబాబుకు... రైతుకు మేలు చేసిన జగనన్నకు చాలా తేడా ఉందన్నారు. మొక్కజొన్న, మామిడికి గిట్టుబాటు ధర కల్పించేంతవరకూ పోరాటం చేస్తామన్నారు.

రైతులకు అనుమతులు లేవా?

పెనుకొండ నియోజకవర్గంలో మట్టి మాఫియాతో పాటు ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నా... అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఉషశ్రీచరణ్‌ మండిపడ్డారు. అక్రమ లేఅవుట్లకు అనుమతులు ఇస్తున్న అధికారులు... రైతులు తమ పొలాలకు మట్టికోలుకునేందుకు ఎందుకు అనుమతులివ్వడం లేదని ప్రశ్నించారు. రైతులకు ఇబ్బందులు కలిగితే ఊరుకోబోమన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు శ్రీచరణ్‌రెడ్డి, నరసింహమూర్తి

పాల్గొ

న్నారు.

అటవీ భూములను పరిరక్షించాలి

ప్రశాంతి నిలయం: అటవీ భూములను పరిరక్షించాలని జేసీ మౌర్య భరద్వాజ్‌ ఆదేశించారు. గురువారం ఆయన ఆర్డీఓతో కలిసి కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో అటవీశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ... సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రెవెన్యూ పరిధిలోని అటవీ భూములు, అడవులను పోలిన భూముల వివరాలను సేకరించి వాటిని అటవీ శాఖకు బదలాయించాలన్నారు. ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. సమీక్షలో జిల్లా అటవీ శాఖ అధికారి చక్రపాణి, సిబ్బంది పాల్గొన్నారు.

చర్చలు సఫలం..

విధుల్లోకి ‘సత్యసాయి’ కార్మికులు

బత్తలపల్లి: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 17 రోజులుగా సమ్మె చేస్తున్న సత్యసాయి కార్మికులతో గురువారం అనంతపురంలోని సత్యసాయి బోర్డు కార్యాలయంలో ఎస్‌ఈ ప్రభాకరరావు, డీఈ రామారావుతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ఐదు నెలల వేతనాన్ని మే నెలాఖరులోపు చెల్లించడం, సమ్మె చేసిన 17 రోజుల కాలాన్ని పని దినాలుగా గుర్తించడం, కార్మికులను జెడ్పీలో విలీనం చేసే ప్రతిపాదన రద్దుచేయడం తదితర డిమాండ్లకు అధికారులు అంగీకరించారు. దీంతో కార్మికులు సమ్మె వీడారు. ఆయా గ్రామాల్లోని పంప్‌హౌస్‌ల వద్దకు చేరుకొని నీటి సరఫరాను పునరుద్ధరించారు.

మహిళల భద్రతకు

అత్యంత ప్రాధాన్యత

అడిషనల్‌ ఎస్పీ అంకిత సురాన

ధర్మవరం అర్బన్‌: మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అడిషనల్‌ ఎస్పీ అంకిత సురాన పోలీసులను ఆదేశించారు. పోక్సో, మహిళలపై జరిగిన దాడులకు సంబంధించిన కేసులను ప్రత్యేక దృష్టితో దర్యాప్తు చేయాలన్నారు. గురువారం ఆమె ధర్మవరం డీఎస్పీ గెస్ట్‌హౌస్‌లో ధర్మవరం సబ్‌ డివిజన్‌ పరిధిలోని సీఐలు, ఎస్‌ఐలతో నేర సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించకూడదన్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై డ్రోన్ల ద్వారా నిఘా ఉంచాలన్నారు. రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలను గమనిస్తూ ఉండాలన్నారు. రోడ్డు భద్రత చర్యలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు చేపట్టాలన్నారు. విచారణలో ఉన్న కేసులను వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలన్నారు. మహిళా సంబంధిత నేరాలు, పోక్సో కేసుల్లో కోర్టుకు సాక్ష్యాధారాలు అందించి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. సమీక్ష సమావేశంలో సీఐలు రెడ్డెప్ప, ప్రభాకర్‌, మహమ్మద్‌ అలి, సునీత, శివరాముడు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

గిట్టుబాటు ధర కల్పించని

కూటమి సర్కార్‌ కూలక తప్పదు

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు

ఉషశ్రీచరణ్‌

Advertisement
 
Advertisement
Advertisement