మూడు రోజుల క్రితం ధర్మవరం ప్రభుత్వాస్పత్రిలో హైకోర్టు న్యాయవాది అంజన్‌రెడ్డిపై బీజేపీ నేతలు హరీశ్‌బాబు, ప్రవీణ్ కుమార్ తదితరులు దాడి చేసి గాయపరిచారు. మంత్రి సత్యకుమార్ పనితీరుపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే అక్కసుతో దుర్మార్గంగా ప్రవర్తించారు. తన బంధువును తీసుకుని ఆస్పత్రికి వెళ్లిన అంజన్‌రెడ్డిని చూసిన బీజేపీ అనుచరులు సీసీ కెమెరాలు లేని ప్రాంతాలకు తీసుకెళ్లి చితకబాదారు. గట్టిగా కేకలు వేయడంతో ఆస్పత్రిలోని రోగులు వెళ్లడంతో పరారయ్యారు. రెండు రోజుల క్రితం అనంతపురంలోని సర్వజనాస్పత్రిలో ధర్మవరానికి చెందిన బీజేపీ కార్యకర్త వేణుగోపాల్ ఓ రోగితో గొడవపడి కుర్చీలు విసిరాడు. దీంతో అక్కడున్న రోగులంతా వణికిపోయారు.


