కదిరి అర్బన్: స్థానిక ఎస్టీఎస్‌ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో ఆదివారం హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా హ్యాండ్‌బాల్ జట్లను ఎంపిక చేశారు. వివిధ ప్రాంతాల నుంచి సుమారు 200 మంది క్రీడాకారులు ఎంపిక పోటీల్లో పాల్గొన్నారు. అందులో ప్రతిభ కనబరచిన వారిని జిల్లా జట్లకు ఎంపిక చేశారు. ఎంపికై న జట్లు మే 9 నుంచి 10వ తేదీ వరకూ కదిరిలో జరిగే 48వ రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో పాల్గొంటాయని హ్యాండ్‌బాల్ జిల్లా కార్యదర్శి మహేష్ తెలిపారు. ఎంపికై నా క్రీడాకారులకు మే నెల 1 నుంచి క్యాంప్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
బాలికల జట్టు :
నక్షత్ర, మాధవి, స్వప్న, ఆదర్శిని, రిహానా, ఓంశ్రీ , ప్రియాంక ఫర్హానా, లోహారిక, వేదసన్, వినీత, జ్యోత్స్న, హర్శిత, యశ్విని, పవిత్ర, స్వాతి, సానియా, కావ్య, లేఖన
బాలుర జట్టు:
విశ్వనాథ్, కుమార్, వేణు, నారాయణనాయక్, మోహిత్‌రెడ్డి, భరత్, హర్శసాయి, జస్వంత్‌నాయక్, తనయ్, ప్రవీన్‌నాయక్, తేజ, తరుణ్, వంశీ, అమీన్ అహ్మద్, మహ్మద్ షోయబ్, స్నేహిత్, సుశాంత్.


