అనంతపురం: ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం విస్మరించింది. బాబు వంచనపై బీసీలు తిరగబడ్డారు. ఇంటికో ఉద్యోగం లేకుంటే నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి, బీసీల డిక్లరేషన్, 50 ఏళ్లకే పింఛన్, బీసీలకు రక్షణ చట్టం, చట్టసభల్లో ప్రాతినిధ్యం తదితర హామీలు ఏమయ్యాయంటూ నిలదీశారు. నాడు చట్టసభలు, నామినేటెడ్, రాజకీయ పదవుల్లో వైఎస్ జగన్ ఇచ్చిన ప్రాధాన్యతను.. చంద్రబాబు బీసీలను వాడుకుని వదిలేస్తున్న తీరును ప్లకార్డులతో ప్రదర్శించి నినదించారు. బీసీలకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్‌గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం అనంతపురం లలితకళాపరిషత్‌లో రాయలసీమ స్థాయి ‘బీసీ గళం’ సభ నిర్వహించారు. రాయలసీమ జిల్లాల నుంచి పార్టీ, బీసీ విభాగం నాయకులు, బీసీలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో సభ విజయవంతమైంది. బీసీలతో సహా అన్ని వర్గాల సంక్షేమం కోసం, జనరంజక పాలన కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ సీఎం చేసుకోవాలంటూ నాయకులతో కలిసి బీసీలు ప్రతినబూనారు. వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సభకు ముఖ్య అతిథిగా వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విశిష్ట అతిథిగా జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు దేవేంద్ర, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీలు మంగమ్మ, వై.శివరామిరెడ్డి, భరత్, పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు నరేష్‌కుమార్‌రెడ్డి, శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్, మాజీ మంత్రి శంకరనారాయణ, మాజీ ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, మాజీ ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, వై.విశ్వేశ్వరరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, నాయకులు మీసాల రంగన్న, ఈరలక్కప్ప, నదీం అహమ్మద్, నైరుతిరెడ్డి, రిలాక్స్ నాగరాజు, పామిడి వీరాంజినేయులు, తిప్పేస్వామి, వజ్ర భాస్కర్‌రెడ్డి, బెస్త రమణ, మాజీ మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు దాసరి వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, పూజారి రాజశేఖర్‌యాదవ్, వీరన్న, గోగుల పుల్లయ్య, శాలివాహన పురుషోత్తం, నూర్‌బాషా సంఘం మాజీ అధ్యక్షుడు రసూల్, పొగాకు రామచంద్ర, విజయలక్ష్మి, హరీష్ యాదవ్, బత్తల హరిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
మళ్లీ జగన్ సీఎం కావాలి
ఎన్నికల హామీల విస్మరణపై ఆగ్రహం
బీసీలను వాడుకుని
తర్వాత వదిలేస్తున్నారు
బీసీల రక్షణచట్టం..
50 ఏళ్లకే పింఛన్ ఏమైంది?
రెండేళ్లవుతున్నా పట్టించుకోలేదంటే.. వంచన కాక ఇంకేంటి?
బీసీలంటే బ్యాక్ బోన్ అని గుర్తించింది ఒక్క వైఎస్ జగన్ మాత్రమే
జనరంజక పాలన కోసం
మళ్లీ జగన్‌ను సీఎం చేసుకుందామని నాయకుల ప్రతిన
అనంతపురంలో రాయలసీమస్థాయి ‘బీసీ గళం’ సభ విజయవంతంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో జోష్


