ధర్మవరం: జర్నలిస్టు ముసుగులో మహిళలను కించపరుస్తూ రోతరాతలు రాసిన రాధాకృష్ణను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు రెడ్డివారి రాజశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాధాకృష్ణ నీచపురాతలను ఖండిస్తూ బుధవారం పట్టణంలోని పీఆర్‌టీ సర్కిల్‌లో వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు రెడ్డివారి రాజశేఖర్‌రెడ్డి, విద్యార్థి విభాగం పట్టణాధ్యక్షుడు శీలం విష్ణువర్దన్, వినయ్ తేజ్‌గౌడ్, మండల అధ్యక్షుడు బిల్లే శ్రీనివాసులు, నాయకులు పోతుకుంట రామ్మోహన్‌రెడ్డి, హరీష్, సూర్యప్రతాప్‌రెడ్డి, ప్రవీణ్, బన్నీ తదితరులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీఎన్ రాధాకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ... వైఎస్ జగన్ చెప్పిన ‘మావిగన్’ కార్యరూపం దాలిస్తే తమకు జరగబోయే నష్టాన్ని ఊహించుకుని భయపడిన కూటమి నేతలు... ఏబీఎన్ రాధాకృష్ణతో వైఎస్సార్ సీపీ నేతల భార్యలపై నీచపు రాతలు రాయించారని మండిపడ్డారు. మహిళలను కించపరిచిన రాధాకృష్ణపై వెంటనే కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ నేతల డిమాండ్ రాధాకృష్ణ దిష్టిబొమ్మ దహనం


