ధర్మవరం: బిహార్‌లోని రాజ్‌గిరి వేదికగా ఏప్రిల్ 1నుంచి 11వ తేదీ వరకూ జరిగే 16వ జాతీయస్థాయి సబ్ జూనియర్ బాలుర హాకీ చాంపియన్‌షిప్ టోర్నీలో ప్రాతినిథ్యం వహించే ఏపీ జట్టులో ధర్మవరానికి చెందిన క్రీడాకారుడు విక్కీకి చోటు దక్కింది. ఈ మేరకు హాకీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడు సూర్యప్రకాష్, జిల్లా హాకీ కోచ్ హస్సేన్ శనివారం వెల్లడించారు. ఎంపికై న క్రీడాకారుడిని ధర్మవరంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో వారు అభినందించారు. కార్యక్రమంలో హాకీ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షులు బండి వేణుగోపాల్, పల్లెం వేణుగోపాల్, జిల్లా అధ్యక్షుడు బీవీ శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు ఉడుముల రామచంద్ర, గౌరీ ప్రసాద్, మహమ్మద్ అస్లాం, ఊకా రాఘవేంద్ర, ట్రెజరర్ అంజన్న, జాయింట్ సెక్రటరీ అరవింద్ గౌడ్, జెన్నే చంద్రశేఖర్, డైరెక్టర్లు మారుతీప్రసాద్, ఇర్షాద్, అమునొద్దీన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


