తప్పని పడిగాపులు | - | Sakshi
Sakshi News home page

తప్పని పడిగాపులు

Mar 26 2026 7:37 AM | Updated on Mar 26 2026 7:37 AM

పెద్దవడుగూరు: గ్యాస్‌ సిలిండర్‌ కోసం రేయింబవళ్లూ ఎదురు చూడాల్సిన దుస్థితికి అద్దం పడుతోంది ఈ దృశ్యం. దాదాపు 4 వేలకు పైగా గ్యాస్‌ కనెక్షన్లు ఉన్న పెద్దవడుగూరులో వంట గ్యాస్‌ కొరత కారణంగా స్థానిక ఇండియన్‌ గ్యాస్‌ ఏజెన్సీ కొన్ని రోజులుగా మూతపడింది. అయితే అప్పటి నుంచి గుత్తికి చెందిన గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకులు ప్రత్యేక వాహనం ద్వారా పెద్దవడుగూరు గ్రామానికి వచ్చి సిలిండర్లను అందజేస్తున్నారు. ఈ క్రమంలో మండలంలోని రాంపురం, గంజిగుంటపల్లి, కొట్టాలపల్లి, పి.వీరన్నపల్లి తదితర గ్రామాలకు చెందిన వినియోగదారులు బుధవారం వేకువ జాము 1 గంటకే పెద్దవడుగూరులోని రచ్చకట్ట వద్దకు ఖాళీ సిలిండర్లతో చేరుకుని అక్కడే నిద్రించారు. ఉదయం 7 గంటలకు వందకు పైగా ఖాళీ సిలిండర్లు అక్కడకు చేరుకున్నాయి. మధ్యాహ్నమైనా వాహనం రాకపోవడంతో వినియోగదారులు పడిగాపులు కాస్తూ రచ్చకట్టపైనే నిద్రిస్తూ కనిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement