విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి

Mar 26 2026 7:37 AM | Updated on Mar 26 2026 7:37 AM

హిందూపురం: స్థానిక మున్సిపాల్టీలో వాటర్‌ పైప్‌లైన్‌ మరమ్మతులు చేసే కార్మికుడు రమేష్‌ (45) విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందాడు. బుధవారం ఉదయం పట్టణంలోని మోత్కుపల్లి రోడ్డులోని మున్సిపల్‌ పంప్‌హౌస్‌ సమీపంలో లీక్‌ అవుతున్న వాటర్‌ పైప్‌లైన్‌కు హాట్‌ జాయింట్‌ చేసే క్రమంలో విద్యుత్‌ షాక్‌కు గురై కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి కార్మికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై వన్‌టౌన్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

గంజాయి విక్రేత అరెస్ట్‌

గుంతకల్లు: స్థానిక హనుమన్‌ సర్కిల్‌లో గంజాయి విక్రయిస్తున్న భాగ్యనగర్‌కు చెందిన షికారీ సోమిని అరెస్ట్‌ చేసినట్లు ఎకై ్సజ్‌ సీఐ జి.శివసాగర్‌ తెలిపారు. అందిన సమాచారం మేరకు బుధవారం ఉదయం తనిఖీలు చేపట్టిన సమయంలో గంజాయి విక్రయిస్తూ సోమి పట్టుబడ్డాడన్నారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి 515 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement