గవర్నర్‌కు స్నాతకోత్సవ ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

గవర్నర్‌కు స్నాతకోత్సవ ఆహ్వానం

Mar 26 2026 7:36 AM | Updated on Mar 26 2026 7:36 AM

అనంతపురం: ఏప్రిల్‌లో జరగనున్న జేఎన్‌టీయూ (అనంతపురం) 15వ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని చాన్సలర్‌/ గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ను వీసీ ప్రొఫెసర్‌ హెచ్‌.సుదర్శనరావు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను వీసీ స్వయంగా గవర్నర్‌కు అందజేసి విన్నవించారు. యూనివర్సిటీ చేపట్టిన కార్యక్రమాలు, గౌరవ డాక్టరేట్‌ ఎంపిక తదితర అంశాలపై చర్చించారు. గౌరవ డాక్టరేట్‌ను భారత దేశ క్షిపణి పుత్రి టెస్సీ థామస్‌కు ఇవ్వనున్నారు. ఈ అంశంపై గవర్నర్‌..వీసీని అభినందించినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement