సేవలు కొనసాగించాలి
గత ప్రభుత్వంలో రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు.
రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు అందించేవారు. పంటల సాగులో రైతు భరోసా కేంద్రం సిబ్బంది రైతులకు అండగా నిలిచేవారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించింది. పథకాలన్నీ పక్కన పెట్టింది. ఇప్పటికైనా రైతుల సంక్షేమ పథకాలు అందించడంతో పాటు గతంలోగా సేవలు అందించాలి.
– జైనుల్లా, సంయుక్త కార్యదర్శి, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం, కదిరి
సేవలన్నీ బంద్ చేశారు
చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరగానే రైతులకు ఎరువులు, విత్తనాలు లేవు. ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ, పంట నష్ట పరిహారం తదితర పథకాలకు మంగళం పాడింది. పంటల సాగులో సూచనలిచ్చే సిబ్బందినీ తగ్గించింది. రైతును విస్మరిస్తే ఓటుతో బుద్ధి చెబుతాం.
– మల్లికార్జున, రైతు, గువ్వలగుట్టపల్లి
సేవలు కొనసాగించాలి


